తెలంగాణ

telangana

'పడకేసిన పల్లె వైద్యం - సీజనల్ వ్యాధులతో జనం విలవిల' - ప్రభుత్వంపై హరీశ్​రావు ఫైర్​ - Harish Rao Tweet On Viral Fevers

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 2:22 PM IST

Harish Rao Fires on Medical Department in Telangana : తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మాజీ మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. సమైక్య పాలనలో కనిపించిన ఉదంతాలు నేడు కాంగ్రెస్​ హయాంలో పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు.

Harish Rao Viral fevers Cases in Telangana
Harish Rao Viral fevers Cases in Telangana (ETV Bharat)

Harish Rao Viral fevers Cases in Telangana :సమైక్య పాలనలో కనిపించిన ఉదంతాలు నేడు కాంగ్రెస్​ హయాంలో పునరావృతం అవుతున్నాయని మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్​ ఫీవర్స్​ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. సీజనల్​ వ్యాధులతో జనం విలవిలలాడి పోతున్నారని, పల్లెల్లో వైద్యం పడకేసిందని వ్యాఖ్యానించారు. వ్యాధుల వ్యాప్తి తీవ్రంగా ఉన్నా చికిత్స అందించడానికి సరిపడా మందులు అందుబాటులో లేవని ఆరోపించారు. ఉమ్మడి పాలనలో చూసిన ఘటనలు కాంగ్రెస్ పాలన పుణ్యమా ఇప్పుడు ఏ పత్రిక చూసినా ఆ వార్తలే కనిపిస్తున్నాయని ట్వీట్ చేశారు.

పాలన గాడి తప్పి, పారిశుద్ధ్యం లేక రోగాలు : మలేరియా, డెంగీ, గున్యా వంటి విషజ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని అర్థమని ధ్వజమెత్తారు. పాలన గాడితప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డెంగీ కిట్స్ లేక రోగులు ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని హరీశ్​ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

"కాంగ్రెస్​ పాలనలో కర్షకులకు కష్టాలు - పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సామే" - Harish Rao Letter to CM Revanth

ఇదంతా చూసీ చూడనట్లు ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. తప్పుడు లెక్కలు విడుదల చేస్తూ, విషజ్వరాల కేసులను తక్కువ చేసి చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ఆయన ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణం కోల్పోకుండా చూడాలని కోరారు.

మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి : విషజ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని సూచించారు. పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని చెప్పిన ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు తెలిపారు.

'వద్దురా నాయనా కాంగ్రెస్ సర్కార్ - రుణమాఫీ లేదు - రైతు భరోసా రాదు' - KTR TWEETS TODAY LATEST NEWS

కాంగ్రెస్​ వచ్చింది - రాష్ట్రంలో తాగునీటి కష్టాలను మళ్లీ తెచ్చింది : హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details