Harish Rao Fires On Tamilisai : రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ ఆమిర్ అలీఖాన్‌లు ఎంపికయ్యారు. వీరిద్దరి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. దీనిపై తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న రహస్య మైత్రి బయటపడిందని హరీశ్‌రావు ఆరోపించారు.
Harish Rao Tweet on Governor Quota MLCs : బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai Soundara Rajan) వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గతంలో తమ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను గవర్నర్ ఎమ్మెల్సీలుగా నియమించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే తమిళిసై ఆమోదించారని హరీశ్‌రావు విమర్శించారు.
దావోస్‌కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారు : హరీశ్‌రావు
Harish Rao Tweet Today :తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై బీఆర్‌ఎస్‌ను అణగదొక్కాలని చూస్తున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం దురదృష్టకరమని అన్నారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని చెప్పారు. కానీ గులాబీ పార్టీకి, హస్తం పార్టీకి మధ్య తమిళిసై తేడా చూపిస్తున్నారని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
Governor Quota MLCs in Telangana : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం (Professor Kodandaram), సియాసత్ పత్రిక ఎడిటర్ ఆమిర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమిళిసై ఆమోదించారు. ఫ్రొఫెసర్ ముద్దసాని కోదండరాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్‌లో 1955 సెప్టెంబరు 5న జన్మించారు. ఆయన తల్లిదండ్రలు వెంకటమ్మ, ఎం.జనార్దన్. హెచ్‌సీయూలో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘాన్ని స్థాపించి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో విద్యార్థుల సమస్యలపై కోదండరాం నిరాహార దీక్ష చేపట్టారు.