Harish Rao Fires on CM Revanth Reddy : తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ్రమల్లో ఉన్నట్లున్నారని, వాటిని వీడి పాలనపై దృష్టి పెడితే మంచిదని మాజీ మంత్రి, హరీశ్ రావు సూచించారు. విద్యుత్ ఉద్యోగులపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు. కరెంట్ కోతల విషయంలో ముఖ్యమంత్రి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
Harish Rao Tweet on Electricity Sector: విద్యుత్ రంగ వైఫల్యాలకు తానే బాధ్యుడిని అన్నట్లుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తోందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని, రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని వివరించారు. కేవలం ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చిందని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీకి గడ్డపారలు అవుతాయి : హరీశ్‌రావు - Harish Rao Counter to CM Revanth