GO 33 Victim Families Meet Harish Rao :తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగజే జీవో-33పై పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఆయన్ను కలిశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై తమ గోడును ఆయనతో వెల్లబోసుకున్నారు. ప్రభుత్వ అనాలోచితంగా తీసుకొచ్చిన ఈ జీవో కారణంగా తమ పిల్లలు వైద్యవిద్య చదివే అవకాశాలు కోల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేళ్ల నిబంధన వల్ల రాష్ట్రంలో పుట్టిన పిల్లలు తెలంగాణలో నాన్‌లోకల్ కావడం అత్యంత బాధగా ఉందని తల్లిదండ్రులు వాపోయారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని తెలిపారు. తమ పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని హరీశ్‌రావును కోరారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులకు పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారు? - సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ - Harish Rao Letter to cm Revanth
ప్రభుత్వ ఉత్తర్వులు 33 సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికత నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించాలని సూచించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో ఏ విధమైన అన్యాయం జరగకుండా చూడాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
KTR Tweet on GO 33 : మరోవైపు ఇదే విషయంపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తెలంగాణ విద్యార్థులకు మెడిసిన్ సీట్ల విషయంలో అన్యాయం చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 ప్రకారం నిర్ధేశించిన స్థానికతలోని అంశాలు, వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయని ఎక్స్ వేదికగా బుధవారం రోజున మండిపడ్డారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించటంలో ప్రభుత్వం విఫలం : హరీశ్ రావు
పిల్లలకు కారం మెతుకులతో భోజనం పెట్టడమేంటి? - కొత్తపల్లి పాఠశాల ఘటనపై కేటీఆర్ - Kothapally Mid Day Meals Issue