ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

"రైట్​, రైట్" మహిళలకు ఉచిత బస్సు​పై చంద్రబాబు కసరత్తు-అమలు ఎప్పట్నుంచంటే? - free bus for women - FREE BUS FOR WOMEN

RTC FREE BUS IN AP : రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అతి త్వరలోనే అమలు కానుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఐదు హామీలపై సంతకం చేసిన చంద్రబాబు.. 16న జరగనున్న క్యాబినెట్​ సమావేశంలో 'ఫ్రీ బస్​' అంశంపై చర్చించనున్నారు. కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ఈ పథకం అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు.

RTC FREE BUS IN AP
RTC FREE BUS IN AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 3:57 PM IST

Updated : Jul 9, 2024, 4:09 PM IST

RTC FREE BUS IN AP : మహిళల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి మరో పథకాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత నెల 13న చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 కీలక హామీలపై సంతకం చేశారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రంపై ఐదో సంతకం చేయడం విధితమే. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ దిశగా అడుగులు వేస్తున్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలోనూ ఆడపడుచులకు కానుకగా అతి త్వరలోనే అందించనున్నారు. గత నెల 13న సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబు.. సూపర్​ సిక్స్​లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడంపై రంగం సిద్ధం చేస్తున్నారు. మహిళల పాలిట వరంలా మారిన ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాల్లో బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు భారీ ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఉచిత బస్ ప్రయాణం కోసం కక్కుర్తి.. బుర్ఖా ధరించి దొరికిపోయిన వ్యక్తి

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 16న కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్ హాలులో ఉదయం 11గంటలకు ఈ సమావేశ జరగనుండగా పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. ముఖ్యంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రీ బస్సు ప్రయాణంపై చంద్రబాబు చర్చించనున్నారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులను పురమాయించిన చంద్రబాబు పలు నివేదికలను తెప్పించుకున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరు, ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇలా అన్ని అంశాలపై ముందస్తుగా లోతైన పరిశీలన చేస్తున్నారు.

'ఫ్రీ బస్' పథకంతో ప్రభుత్వంపై పెను భారం.. ఒక్క రోజు బిల్ ఎంతో తెలుసా?

ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న జీరో టికెట్​ విధానంపై ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఏ విధానం అమలుకు అవకాశం ఉంటుందో ప్రాథమికంగా ఓ నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోనూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డీనరీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తుండగా కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? లేదా ఉమ్మడి జిల్లాల పరిధిలో అనుమతిస్తారా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో మాదిరిగా రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణానికి అవకాశం ఉంటుందా? అనేది క్యాబినెట్​ సమావేశంలో చర్చ ప్రధానంగా చర్చ జరగనుంది. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు జీరో టికెట్​ ఇస్తుండగా అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంటుంది.

టీడీపీ 'మహాశక్తి'- ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఆడపడుచు ఆసక్తి - Free bus For Women

Last Updated : Jul 9, 2024, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details