Karimnagar Residents set up Saboon Banners to Prevent Monkeys : ఆ కాలనీలో కోతుల సమస్య ఎక్కువ. ఎటు చూసినా అవే. ఏమైనా పనులు చేసుకోవాలన్నా, బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాలన్నా కోతులు ఎక్కడ మీదకు ఎగబడతాయోనని ఆ కాలని వాసులు భయం భయంగా ఉంటున్నారు. ఇంటి బయట ఏమైనా పెడదామంటే వాటిని ఏం చేస్తాయో అని సందిగ్ధం. అసలు వాటి ఏమీ చేయలేము, అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండట్లేదు.
దీంతో వాళ్లంతా ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. కోతులను కొట్టకూడదు, అవి ఇంట్లోకి రాకుడదు అలానే ఇంటి గేటు ముందుకు వచ్చాయంటే భయపడి వెళ్లిపోవాలి. ఇలా ఏం చేస్తే బాగుంటుంది అనుకుని వారు ఒక పని చేశారు. అంతే ఆ కాలనీలో ఏ ఇంటికీ కోతులు రావడం లేదు. ఒకవేళ వచ్చినా భయపడి వెళ్లిపోతున్నాయి. అలా అవి రాకుండా వారు ఏం చేశారంటే.
తెలంగాణలోని కరీంనగర్ వాసవి నగర్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో ఏదైనా పట్టుకుని వెళ్తే వారిపై దాడులు చేస్తున్నాయి. ఇంటి బయట ఏమైనా పెడితే ఇక దాని గురించి మర్చిపోవాల్సిందే. వాటిని ఏమీ అనలేరు, కొట్టలేరు. ఇంక ఏమీ చేయాలో తెలీక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అనుకున్నారు.
అంతా కలిసి ఒక మాస్టర్ ప్లాన్ : కోతులు ఇంట్లోకి రావాలంటే అవి భయపడిపోవాలి. అది కాలనీవాసుల అజెండా. అందుకు వారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ కోతులు వేటికి ఎక్కువగా భయపడతాయో ఆలోచించారు. అయితే వారికి ఠక్కున కొండముచ్చు గుర్తొచ్చింది. సాధారణంగా కోతులు కొండముచ్చులను చూసి భయపడతాయన్న విషయం అందరికి తెలిసిందే. ఇదే పరిష్కారంగా భావించిన కాలనీవాసులు కొండముచ్చుల ఫొటోలను బ్యానర్లుగా చేసి ప్రతి ఇంటి గేటుకు కట్టారు. అంతే ఇక ఆ రోజు నుంచి అక్కడ కోతులు బెడదే లేదు. ఇలా వారి సమస్యకు ఐకమత్యంగా ఆలోచించి పరిష్కరించారు. కనీసం ఇప్పుడైన అధికారులు పట్టించుకుని కోతుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
పది కిలోల చేప - చేతులకే చిక్కిందిగా!
సీఎం రేవంత్‌ను కలిశా - అల్లు అర్జున్ను కలుస్తాను - ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తా: దిల్ రాజు