Police Arrest Inter State Irani Gang: చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడ్డుతున్న అంతర్ రాష్ట్ర ఇరానీ గ్యాంగ్‌ను తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళతో సహా ఆరుగురు ముఠా సభ్యుల్ని పట్టుకున్నారు. వీరి నుంచి 40 లక్షల రూపాయల విలువైన 382 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇరానీ గ్యాంగ్ నేరాలకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో 14 పోలీస్ స్టేషన్లలో వీరిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, మహారాష్ట్రల్లో ఈ ముఠా సభ్యులు మోస్ట్ వాంటెడ్ నేరస్తులుగా ఉన్నారు.
బైకులపై 700 కిలోమీటర్లకు పైగా అడవిలో ప్రయాణించి రాజమహేంద్రవరంలో దొంగతనాలకు పాల్పడ్డారు. గత నెలలో గోకవరంలో చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను ఢీ కొట్టి బైకులపై పరారయ్యారు. ఈ వ్యవహారాన్ని సవాల్‌గా తీసుకున్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేక బృందాలను ఒడిశా ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు పంపించి వీరి కోసం గాలించారు. చివరకు చత్తీస్‌గడ్‌లోని తిక్రీలో పట్టుకున్నట్టు ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు తెలిపారు.
5 రాష్ట్రాల్లో 150 కేసుల్లో నిందితులుగా ఉన్న ఈ నేరస్తులను రాజమహేంద్రవరం పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ చెప్పారు. పోలీస్ అధికారుల సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు.
మందలించిన భర్త - ప్లాన్ ప్రకారం హత్య చేయించిన భార్య
బర్డ్ ఫ్లూ అలర్ట్ - చికెన్ దుకాణాలు మూసివేత - రంగంలోకి రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు