ETV Bharat / politics

దిల్లీకి సీఎం చంద్రబాబు - కేంద్రమంత్రులతో కీలక భేటీ - CM CHANDRABABU VISIT TO DELHI

నేడు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు - రేపు ఉదయం వాజపేయి జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

cm_chandrababu_visit_to_delhi
cm_chandrababu_visit_to_delhi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2024, 6:54 PM IST

CM Chandrababu Delhi Tour: సీఎం చంద్రబాబు ఈ రోజు దిల్లీ చేరుకొనున్నారు. దిల్లీలో రేపు జరగబోయే కీలక కార్యక్రమాలకు హాజరైన అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రేపు దిల్లీలో జరిగే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు ఉదయం 8.30గం.ల నుంచి విజయ్ ఘాట్ సమీపంలో ఉన్న సదైవ్ అటల్ ప్రదేశంలో జయంతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో జరగనుంది. కావున ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం జరగనుంది. ఈ ఎన్డీఏ నేతల సమావేశానికి సీఎం చంద్రబాబు కూడా హాజరుకానుకన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకువచ్చిన నూతన సంస్కరణలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఎన్డీఏ నేతలు అవుతున్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ నేతలు తొలిసారి భేటీ కానున్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరిపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు పది కాలాలు ఉపయోగపడాలి: పవన్​కల్యాణ్​

పార్టీ జెండా మోసేది కార్యకర్తలే - వారిని నిత్యం గౌరవించాలి: నేతలతో చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.