తెలంగాణ

telangana

ETV Bharat / politics

అక్కడ గెలిస్తే ఫేటే మారిపోతుంది - మరి ఈటల భవిష్యత్ కూడా బంగారమేనా? - Etela Rajender Won Malkajgiri MP SEAT

Malkajgiri Lok Sabha Seat : ఆ లోక్​సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అయితే అక్కడ ఎవరు గెలిచినా సరే రాజకీయంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారనే నమ్మకం ఉంది. ఇప్పటివరకు అలానే గెలుపొందిన అభ్యర్థులు రాజకీయంగా ఉన్నతంగా నిలదొక్కుకున్నారు. ఆ స్థానమే మల్కాజిగిరి లోక్​సభ నియోజకవర్గ స్థానం. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గమే కాకుండా అక్కడ ఎవరు పోటీ చేసిన రాజకీయంగా భవిష్యత్​లో శిఖరాగ్రానికి చేరుతున్నారు. అందుకే ఆ స్థానం కోసం చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. మరి ఈసారి అక్కడ బరిలో దిగి విజయఢంకా మోగించిన బీజేపీ నేత ఈటల రాజేందర్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?

Malkajgiri Lok Sabha Seat
Malkajgiri Lok Sabha Seat (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 10:15 AM IST

BJP Leader Etela Rajender Wins Malkajgiri MP Seat : దేశంలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరి చూపు మల్కాజిగిరి లోక్​సభ నియోజకవర్గం మీదే ఉండే ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న స్థానం. ఇక్కడ 37,79,596 మంది ఓటర్లు ఉన్నారు. వారు ఎటువైపు మొగ్గుచూపితే ఆ గెలుపొందిన అభ్యర్థి అత్యధిక మెజారిటీని సాధిస్తారు. అయితే ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థి ఆ తర్వాత కాలంలో రాజకీయంగా ఉన్నత పదవులు సాధించడం ఆనవాయితీగా వస్తుంది. 2009లో పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంతమంది అభ్యర్థులు గెలిచారో? వారు ఏ స్థానాల్లో ఉన్నారో? తెలుసుకుందాం.

మొట్టమొదటిసారి లోక్​సభ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఎదిగారు. 2012-14 వరకు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

మంత్రిగా మల్లారెడ్డి : 2014లో తెలుగుదేశం తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలుపొంది. పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత బీఆర్​ఎస్​లో చేరారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ నుంచి మేడ్చల్​ అసెంబ్లీ నుంచి గెలిచి మంత్రి పదవిని పొందారు.

సీఎంగా రేవంత్​ రెడ్డి : 2014 తర్వాత జరిగిన 2019 లోక్​సభ ఎన్నికల్లో 2018లో కొడంగల్​ నియోజకవర్గం నుంచి పరాజయం పాలైన రేవంత్​ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయనను మల్కాజిగిరి ఆదుకుందనే చెప్పాలి. ఎందుకంటే 2019లో లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ తరఫున పోటీ చేసి అత్యధిక ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు పదవి పొంది 2023 శాసనసభ ఎన్నికలో ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.

మరి రాజేందర్​ పరిస్థితి ఏంటి ? : ఇది మల్కాజిగిరి లోక్​సభ నియోజకవర్గానికి ఉన్న సత్తా. అయితే ఇప్పుడు 2024 లోక్​సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్​ పోటీ చేశారు. భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. అంతకు ముందు 2023లో జరిగిన హుజూరాబాద్​ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మళ్లీ మల్కాజిగిరి లోక్​సభ స్థానంలో పోటీ చేసి గెలుపొందారు. మరి పాత ఆనవాయితీ ప్రకారం ఈటల రాజేందర్​ కూడా ఉన్నత పదవులను అధిరోహిస్తారని కొందరు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈసారి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ఎవరు ఉంటారు? ఈటల రాజేందర్​కి కేంద్రమంత్రి పదవి వస్తుందా అనేది రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది: ఈటల రాజేందర్‌ - Etela Rajender on Lok Sabha Polls

కాంగ్రెస్​కు గట్టి పోటీనిచ్చిన కమలదళం - ఓటు షేరింగ్​ ఎంతో తెలుసా? - BJP WINNING SEATS IN TELANGANA LOK SABHA ELECTIONS

ABOUT THE AUTHOR

...view details