Etela Rajender Election Campaign :దేశానికి క్యాన్సర్ పట్టినట్లు బీజేపీ పట్టుకుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. రేవంత్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దేశానికి క్యాన్సర్‌లా పట్టింది కాంగ్రెస్ అని కౌంటర్వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలంటూ మోసం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డం మొదలు పెట్టారని ఆరోపించారు. దేశం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితికి రావడానికి కాంగ్రెస్ కారణం అన్న ఆయన బీజేపీని విమర్శించడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమి లేదంటూ మండిపడ్డారు.
"ఎలాంటి అవినీతి, ఉగ్రవాదం లేకుండా దేశాన్ని పాలిస్తున్న గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో జరిగిన కుంభకోణాల గురించి ప్రస్తావించారు. అత్యంత సమర్థవంతమైన మోదీ నాయకత్వంలో ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ను తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. మల్కాజిగిరి ప్రజానీకం నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. మల్కాజిగిరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారి పక్షాన నిలుస్తాను." - ఈటల రాజేందర్, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి
ఆ ఒక్కటి తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేం లేదు - రేవంత్ హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్ : ఈటల రాజేందర్ - ETELA SLAMS CONGRESS GOVT
Lok Sabha Election Campaign 2024 :గతంలో అనేక సమస్యల పరిష్కారం కోసం మల్కాజిగిరి ప్రజలతో మమేకమై పని చేసినట్లు గుర్తు చేశారు. కులమతం భేదం లేకుండా పని చేసే వ్యక్తినని చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో పాటు పేద ప్రజలకు అనేక సేవ కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తిగా తనను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్లో ఇప్పటికే ఒక్కో ఓటర్‌కు రెండు వేలు ఇస్తూ, మద్యం పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న వంశ తిలక్‌ను ప్రజలు గెలిపించాలని కోరారు. మల్కాజిగిరిలో ఉన్న మురికి వాడలు, ప్రభుత్వ, వక్ఫ్ బోర్డు, మంచి నీటి, సాగునీటి సమస్య, ఉప్పల్ ఫ్లే ఓవర్ సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని సమస్యలను పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు.
6 గ్యారంటీలంటూ మోసం చేసిన కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది ఈటల రాజేందర్ (ETV Bharat) సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాక్‌లో ఉగ్రవాదులను ఏరిపారేశాం - కాంగ్రెస్‌కు అలా చేసే దమ్ముందా? : అమిత్ షా - Amit Shah Election Campaignసార్వత్రిక ఎన్నికలు 2024 - డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ ప్రచారం సాగిందిలా - BJP Lok Sabha Election Review