తెలంగాణ

telangana

ETV Bharat / politics

కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించాం : డిప్యూటీ సీఎం భట్టి - Deputy CM Bhatti Press Meet

Deputy CM Bhatti Vikramarka Press Meet at Secretariat : గత ప్రభుత్వం యాసంగి రైతుబంధు 4 నెలలలోపు కంటే తక్కువ సమయంలో ఎప్పుడూ ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వం తొందరగానే ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Deputy CM Bhatti Vikramarka
Deputy CM Bhatti Vikramarka Press Meet

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 6:35 PM IST

Updated : Mar 9, 2024, 10:41 PM IST

Deputy CM Bhatti Vikramarka Press Meet at Secretariat : బీఆర్​ఎస్​ సర్కార్​తో పోలిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు(Rythu Bandhu)ను తొందరగానే ఇస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని(Indiramma House Scheme) ప్రారంభిస్తున్నారమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే బడ్జెట్​లో సంక్షేమ పథకాలకు రూ.53,196 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈనెల 12న మహిళలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడూ మొదటివారంలో జీతాలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు, ఫించనర్లకు మార్చి 1న జీతాలు ఇచ్చామని ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం డబుల్​ బెడ్​ రూం ఇళ్లని చెప్పి పదేళ్లు గడిచిన ఒక్క ఇళ్లు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు.

బలహీన వర్గాలకు భవిష్యత్‌లో ఉపప్రణాళిక తెస్తాం : భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka on Salaries :కానీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 3,500 మందికి ఇళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. యాసంగి రైతుబంధు 4 నెలలలోపు కంటే తక్కువ సమయంలో ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు. అంగవాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు వీరందరికీ జీతాలు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్​లో రాష్ట్రంలో విద్యుత్​ కోతలు ఉండవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో చెప్పినట్లు విద్యుత్​ అధికారులకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టాటా టెక్నాలజీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఐటీఐ కాలేజీల్లో స్కిల్​ సెంటర్ల ఏర్పాటుకు ఏంఓయూ జరిగిందని ఇది చాలా శుభ ప్రథమైన అంశమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆనందించారు.

ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ సంస్థలు ఎదగాలి - పాడి రంగం ప్రగతికి సాయం చేస్తాం : భట్టి విక్రమార్క

ఇందిరా క్రాంతి పథకం కింద డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు : భట్టి విక్రమార్క

Last Updated : Mar 9, 2024, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details