తెలంగాణ

telangana

ETV Bharat / politics

ప్రధాని మోదీ ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేస్తారు: కూనంనేని - CPI MLA Kunamneni Comments on Modi

CPI MLA Kunamneni Comments on PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చి హడావుడి చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి వచ్చారా లేక, రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు.

CPI MLA Kunamneni Comments on PM Modi
Kunamneni Comments on Rahul Contest

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 10:43 PM IST

CPI MLA Kunamneni Comments on PM Modi :ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చి హడావుడి చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నరేంద్ర మోదీ(Narendra Modi) కనికరంలేని రాజకీయ నాయకుడని విమర్శించారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి వచ్చారా లేక రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు.

అధికారిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రధానిని పెద్దన్న అని కొనియాడితే, కాసేపటికే పార్టీ సభలో మోదీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డికి(Palamuru Rangareddy Project) జాతీయ హోదా ఇస్తారా లేదా ఎన్నికల ముందే చెప్పాలని ప్రధానిని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఐకు 5 స్థానాలు కేటాయించాలి: చాడ వెంకట రెడ్డి

"ప్రతి ఎన్నికల ముందు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తారు. గతంలోనూ మునుగోడు ఎన్నికలు, ప్రతి ఉపఎన్నికల ముందు ఏదో అభివృద్ధి పేరిట వచ్చి హడావుడి చేశారు. ఈమేరకు రోడ్లు నిర్మాణాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. నరేంద్ర మోదీ కనికరం లేని రాజకీయ నాయకుడు. తాజా తెలంగాణ పర్యటన, మీ రాజకీయ మీటింగ్‌ కోసమా? లేదా అభివృద్ధి పనులను చేయటానికా? ఈ విధంగా తప్పుడు సంకేతాలు దేశ ప్రధాని వంటి వ్యక్తి ఇవ్వటం సరైనది కాదు."-కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

Kunamneni Comments on Rahul Gandhi Contest :బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం వాళ్ల వ్యక్తిగత విషయం అన్నారు. బీఆర్‌ఎస్‌లో మొన్నటికి, ఇవాళ్టికీ ఏ మార్పు వచ్చిందో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) చెప్పాలన్నారు. ఆయన బీఆర్‌ఎస్‌తో కలవడం దురదృష్టకరం అన్నారు. ఐదు పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్‌కు ప్రతిపాదన పెట్టామని చెప్పారు.

తాము ఐదింటిలో కనీసం ఒక సీటైనా సీపీఐకి ఇచ్చి కాంగ్రెస్ మిత్ర ధర్మం పాటించాలని కోరారు. అదేవిధంగా కేరళలోని వయనాడ్‌లో రాహుల్ గాంధీ పోటీ చేయకుండా తప్పుకుంటే మంచిదని సూచించారు. గతంలో రాహుల్ గాంధీ(Congress Rahul Gandhi) సీపీఐ అభ్యర్థిపైనే విజయం సాధించారని తెలిపారు. వయనాడ్ సీపీఐకి ఇచ్చి రాహుల్ గాంధీ మిత్ర ధర్మం పాటించాలని కోరారు.

Kunamneni Sambasivarao Fires on BRS :కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Project) సందర్శించిన బీఆర్‌ఎస్‌ నేతలకు ఏమీ మాట్లాడాలో స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ఏమీ మాట్లాడాలో అర్థంకాక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని గులాబీ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే నిపుణుల కమిటీ నివేదికను త్వరితగతిన ఇవ్వాలని కోరాలన్నారు.

సీఎం పదవి కోసం బీఆర్ఎస్ చాలా ఆరాటపడుతోంది - హరీశ్​రావు అలా అనడం సిగ్గుచేటు : నారాయణ

'లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం పని చేస్తాం - వాళ్లు అధికారంలోకి వస్తే దేశానికే విపత్తు'

ABOUT THE AUTHOR

...view details