తెలంగాణ

telangana

ETV Bharat / politics

అసెంబ్లీకి రాని ప్రతిపక్షనాయకుడు మనకు అవసరమా? - కేసీఆర్​పై కాంగ్రెస్ నేతల ఫైర్ - Telangana Assembly Sessions 2024

Congress MLAs Fires on KCR : శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి హాజరుకాని ప్రతిపక్షనాయకుడు మనకు అవసరమా అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ పార్లమెంట్ సభ్యులుగా లోక్‌సభకు వెళ్లలేదని, ఇప్పుడు అసెంబ్లీకి కూడా రావడం లేదని మండిపడ్డారు.

MLA Malreddy Rangareddy Fires on KCR
Congress MLAs Fires on KCR

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 5:53 PM IST

Congress MLAs Fires on KCR : తమ నియోజకవర్గాలకు వెళ్లితే పదేళ్ల బీఆర్ఎస్(BRS) హయాంలో చేసిన అరాచకరాలను ప్రజలు తమతో చెప్పుకుని ఏడుస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాలో పాయింట్ వద్ద మాట్లాడారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి హాజరుకాని ప్రతిపక్షనాయకుడు మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు.

MLA Malreddy Rangareddy Fires on KCR : గతంలో కేసీఆర్(KCR) పార్లమెంట్ సభ్యులుగా లోక్‌సభకు వెళ్లలేదని ఇప్పుడు అసెంబ్లీకి కూడా రావడం లేదని మల్​రెడ్డి రంగారెడ్డి మండిపడ్డారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడతో ఉండేదని, ఇప్పుడు మార్చే తెలంగాణ తల్లి విగ్రహంలో గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా ఉంటుందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఛాంబర్‌ కోసం గొడవపడడంమెందో అర్థం కావడంలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడే భాష సరిగాలేదని పద్దతి మార్చుకోవాలని చంద్రునాయక్ హితవు పలికారు.

కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం - రేవంత్ రెడ్డి సెటైర్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ గవర్నర్ ప్రసంగం వినాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్​పైన ఉంది. నీకు అధికారం మాత్రమే కావాలా?. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజల సంక్షేమంకు ప్రభుత్వం అమలు చేయబోయే కార్యక్రమాలకు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. పేరుకు మాత్రమే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారా? ఇటువంటి ప్రతిపక్ష నేత ప్రజలకు అవసరం లేదు. - మల్​రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే

రాబోయే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాము. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశాము. మరో రెండు గ్యారంటీలను ప్రవేశపెట్టబోతున్నాము. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. అప్పులకుప్పగా మార్చారు. నియంతృత్వ, రాచరిక పోకడలతో పాలన సాగించారు. కుటుంబపాలనకే ప్రాధన్యమిచ్చారు. ప్రతిపక్ష ఛాంబర్ కోసం బీఆర్ఎస్ నేతలు కొట్లాడటం హస్యాస్పదంగా ఉంది. - ఆది శ్రీనివాస్, విప్ వేములవాడ ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రజలు కుటుంబపాలనకు స్వస్తి చెప్పి ప్రజాపాలనను కోరుకున్నారు. ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు హామీలను అమలు చేస్తాము. బీఆర్ఎస్ నేతలు ఇంకా అహంకారంతోనే మాట్లాడుతున్నారు. వారి హయాంలో ఎన్నో వేల హామీలను ఇచ్చి తుంగలో తొక్కారు. మా ప్రభుత్వం వచ్చి వందరోజులు కాకముందే, హామీలు అమలు చేయాలంటూ ఆలోచనారహితంగా మాట్లాడుతున్నారు. మేము ఇచ్చిన హామీలను తప్పకుండా అమలుచేస్తాము. - వంశీకృష్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే

మా ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. వారి పద్దతి మార్చుకోవాలి. వారి హయాంలో ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారు. యువతను ఉద్యోగాలపేరుతో వంచించారు. వారి హయాంలో ఇచ్చిన ఉద్యోగాల కంటే తీసేసిన ఉద్యోగాలే ఎక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాము. ఇచ్చిన హామీలను అమలుచేస్తాము. - చంద్రునాయక్, ఎమ్మెల్యే

అసెంబ్లీకి రాని ప్రతిపక్షనాయకుడు మనకు అవసరమా?- కేసీఆర్​పై కాంగ్రెస్ నేతల ఫైర్

'నేను పార్టీలోకి వచ్చిందే అందుకు - ఆ పదవి ఇస్తేనే వాళ్లు కంట్రోల్​లో ఉంటారు'

టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపై విమర్శలు సరికాదు: కొండా సురేఖ

ABOUT THE AUTHOR

...view details