డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు అంచనా కలిసొచ్చిన రేవంత్ ప్రచారం (ETV Bharat) Congress on Lok Sabha Elections in Telangana :రాష్ట్రం ఏర్పాటైన తరువాత నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికలు ఒకఎత్తు ఇప్పుడు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలు మరొక ఎత్తుగా అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్‌లోకి రావడం, గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు భారీగా జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్థం చేసినట్లు విమర్శలు చేయడంతోపాటు కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అమలుకు శ్రీకారం చుట్టడం లాంటివి కాంగ్రెస్‌కు కలిసొచ్చినట్లు చెప్పొచ్చు.
అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం, ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చేట్లు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం లాంటి చర్యలు తీసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల కారణంగా కుంగిపోయిందని ఆరోపణలు చేయడం ఇలా అనేక అంశాల కారణంగా బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో కొంత ఆదరణ తగ్గిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.
కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి - మంత్రులు ఎక్కడెక్కడ వేశారంటే? - CM Revanth Reddy Casted Vote
పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయని భావించిన బీజేపీ ఏకంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతోపాటు సీనియర్ నాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయడం, రామ మందిరం నిర్మాణం, అక్షింతలు పంపిణీ లాంటివి బీజేపీకి ఓటర్లను తెచ్చి పెట్టే అనుకూల అంశాలుగా మారినట్లు కాంగ్రెస్ అంచనా వేసింది. బీజేపీ రాష్ట్రంలో తిష్ట వేసినట్లయితే రాష్ట్రానికి క్యాన్సర్ సోకినట్లేనని సీఎం తీవ్రంగా స్పందించారు. దీంతో బీజేపీ ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు ధీటైన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం ప్రచారం నిర్వహించింది.
Congress Developments In Telangana :ప్రధానంగా అధికార కాంగ్రెస్ అయిదు గ్యారంటీల అమలు, బీఆర్‌ఎస్ అవినీతి, ధరణి పోర్టల్ సమస్యలు, రైతు రుణమాఫీ, కేంద్రంలో బీజేపీ పదేండ్లు అధికారంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి లభించలేదని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. ఉద్యోగాలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తిగా అమలు చేస్తామని, ఐదు న్యాయాలను అమలు చేస్తామని గడపగడపకు తీసుకెళ్లారు. అదేవిధంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కూడా పదే పదే ప్రచారం చేశారు. బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ తమ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలను అన్నింటిని ఉపయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పార్లమెంటు ఎన్నికల్లో 14 స్థానాలు చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఏఐసీసీ కూడా ముందుకు వెళ్లింది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఐదు న్యాయాలను తెలుగులో విడుదల చేయడంతో మొదలు పెట్టిన ప్రచారం ఈ నెల 11వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలను మంత్రులకు, సీనియర్ నాయకులకు ఇంఛార్జిలుగా నియమించి బాధ్యతలు అప్పగించారు. గెలిపించుకుని రావాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ - ఓటింగ్ శాతం ఎంతంటే? - TS LOk sabha Polls 2024 Ended
ఎక్కువ భాగం మంత్రులు, సీనియర్ నేతలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు నెల రోజులుగా వారికి కేటాయించిన నియోజక వర్గాలల్లోనే మకాం వేసి ప్రచారంతోపాటు నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతోపాటు ప్రతి నియోజక వర్గంలో ఒకట్రెండు బహిరంగ సభలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నీతానై ప్రచార బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకుని ముందుకు వెళ్లారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు.
ప్లస్‌గా మారిన రేవంత్ ప్రచారం :ఏప్రిల్ 6వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి 28 రోజుల్లో 60కిపైగా సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి చూస్తే తాజా రాజకీయ పరిస్థితుల్లో ముందు నుంచి అనుకున్నట్లు 14 పార్లమెంటు స్థానాలు రావడం కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. డబుల్ డిజిట్ స్థానాలైతే ఖచ్చితంగా వస్తాయని, పది అంతకు మించి ఎన్ని స్థానాలు వచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బోనస్ కింద అనుకోవాల్సి ఉంటుందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి.
టికెట్లు ఇచ్చే విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో అటు ఏఐసీసీ, ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తప్పిదాలు చేయడం వల్లనే ఒకట్రెండు స్థానాలను చేజార్చుకోవాల్సి పరిస్థితి వచ్చిందన్న భావన కొందరు నాయకుల్లో వ్యక్తమవుతోంది. కాని పార్టీపరంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పార్లమెంటు నియోజక వర్గాల ఇంఛార్జిలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ నాయకులు శక్తికి మించి పని చేయడం వల్లనే తాజా రాజకీయ పరిస్థితుల్లో అత్యధిక స్థానాలను చేజిక్కించుకుంటామన్న విశ్వాసం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలు- ఓటింగ్ శాతం ఎంతంటే? - LOK SABHA POLLS 2024