Rahul Gandhi Telangana Tour :కాంగ్రెస్ అగ్రనేతరాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దైంది. సాయంత్రం వరంగల్ రావాల్సిన ఉన్న రాహుల్ గాంధీ, పార్లమెంటు సమావేశాల కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నారు.
అసలేం జరిగింది : ఇవాళ రాహుల్ గాంధీ హైదరాబాద్, వరంగల్ పర్యటనకు రావాల్సింది. మధ్యాహ్నం 2.45 గంటలకు దిల్లీ నుంచి సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సింది. అక్కడ నుంచి సాయంత్రం 5.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు వరంగల్ చేరుకోవాల్సింది. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేడు వరంగల్ వెళ్లాల్సింది.
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా రాహుల్ గాంధీతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. వరంగల్‌లో దాదాపు రెండు గంటల పాటు రాహుల్ గాంధీ ఉంటారని ఉంటారని అనుకున్నారు. రాత్రి 7.45 గంటలకు వరంగల్‌లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో బయలుదేరి చెన్నై బయలుదేరి వెళ్లాల్సింది.