Congress Exercise on MP candidates :రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీ-బీఆర్ఎస్ దీటుగా అభ్యర్థుల్ని నిలిపి కనీసం 14 స్థానాలను చేజిక్కించుకునే దిశలో రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తోంది. నారాయణపేట జిల్లా కోస్గీ వేదికగా జరిగిన బహిరంగ సభలో హస్తం పార్టీ తొలి లోక్‌సభ అభ్యర్థిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచంద్‌ను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక మిగతా 16 స్థానాలకు బలమైన అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.
Congress Focus on Parliament Election 2024 :ఇప్పటికే టికెట్ల ఆశిస్తూ 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. బలమైన నేతలు లేని చోటా ఇతర పార్టీల నుంచి పార్టీలోకి వచ్చే వారికి ప్రాధాన్యం కల్పించాలని యోచిస్తోంది. సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తారని భావించిన అనిల్‌కుమార్ యాదవ్ రాజ్యసభకు ఎంపిక కావడంతో అక్కడ నుంచి బలమైన నాయకుడిని బరిలో దించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ(GHMC) మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్యా స్రవంతి, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ స్వామి సికింద్రాబాద్ నుంచి పోటీకి చొరవ చూపుతున్నారు.
లోక్‌సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!