Congress Winning Seats in Telangana Lok Sabha Election : లోక్‌సభ ఫలితాల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు, అదే జోష్‌తో లోక్‌సభ ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకెళ్లారు. గతంలో కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించగా, ఈసారి ఆ సంఖ్య 8కి చేరింది.
తెలంగాణలో కాంగ్రెస్ జయకేతనం - 8 స్థానాల్లో విజయదుందుభి - TELANGANA LOK SABHA ELECTION RESULTS 2024 - TELANGANA LOK SABHA ELECTION RESULTS 2024
Telangana Lok Sabha Election Results 2024 : లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకెళ్లారు. గతంలో 3 స్థానాలతో సరిపెట్టుకున్న హస్తం నేతలు, ఈసారి ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకున్నారు.
Published : Jun 4, 2024, 3:10 PM IST
|Updated : Jun 4, 2024, 4:15 PM IST
ఖమ్మంలో నామ నాగేశ్వరరావు (బీఆర్ఎస్)పై రఘురాం రెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించగా, వరంగల్‌లో ఆరూరి రమేశ్ (బీజేపీ)పై కడియం కావ్య (కాంగ్రెస్) విజయ దుందుభి మోగించారు. నల్గొండలో సైదిరెడ్డి (బీజేపీ)పై కుందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్) గెలవగా, మహబూబాబాద్‌లో మాలోత్ కవిత (బీఆర్ఎస్)పై బలరాం నాయక్ (కాంగ్రెస్) గెలుపొందారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ విజయం సాధించారు. భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) 1.95 లక్షలకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. నాగర్ కర్నూల్లో 88 వేలకు పైగా ఆధిక్యంతో మల్లు రవి (కాంగ్రెస్), పెద్దపల్లిలో 1.31 లక్షలకు పైగా మెజార్టీతో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్) విజయం సాధించారు.
కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు వీరే :
- నల్గొండలో రఘువీర్ రెడ్డి 5.37 లక్షలకు పైగా మెజార్టీతో విజయం
- ఖమ్మంలో రఘురాంరెడ్డి 4.56 లక్షలకు పైగా మెజార్టీతో విజయం
- వరంగల్‌లో కడియం కావ్య 2.02 లక్షలకు పైగా మెజార్టీతో విజయం
- మహబూబాబాద్‌లో బలరాం నాయక్ 3.24 లక్షలకు పైగా మెజార్టీతో విజయం
- జహీరాబాద్‌లో సురేశ్ షెట్కార్ 45 వేలకు పైగా మెజార్టీతో విజయం
- భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి 1.95 లక్షలకు పైగా మెజార్టీతో విజయం
- నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి 88 వేలకు పైగా మెజార్టీతో విజయం
- పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షలకు పైగా మెజార్టీతో విజయం