CM YS Jagan Public Meeting at Uravakonda: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సైతం కేవలం విమర్శలకు మాత్రమే సీఎం జగన్ పాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చెప్పాల్సింది పోయి, విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం సభలకు మహిళలను భయపెట్టి తీసుకొని వస్తున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అయితే సీఎం సభ ప్రాంగణం ఎదుటే వైసీపీ కార్యకర్తలు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు తాగుతూ, సభ ప్రాంగణంలోకి వెళ్లారు. సీఎం జగన్ సభతో తమకేమీ సంబంధం లేదంటూ వైసీపీ కార్యకర్తలు మద్యం మత్తులో తేలిపోయారు. కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు విచ్చలవిడిగా తీసుకొచ్చి సేవించారు.
ప్రచార పిచ్చి- అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలోనూ సీఎం జగన్పై నేతల ఆహా ఓహో!
CM Jagan Comments in Uravakonda: నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడత నిధులు విడుదల చేశారు. అయితే ఎప్పటిలాగే ఈ సభలో సైతం సీఎం కేవలం విమర్శలకు మాత్రమే తన ప్రసంగంలో సమయం కేటాయించారు. కనీసం రాష్ట్ర పరిస్థితి గురించి ఒక్క మాట్లాడలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు చాలా మంది స్ఠార్ క్యాంపెయినర్లు ఉన్నారని అన్నారు.