తెలంగాణ

telangana

ETV Bharat / politics

కాంగ్రెస్​ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రత్యేకం : సీఎం రేవంత్​ - CM Revanth Reddy Press Meet - CM REVANTH REDDY PRESS MEET

CM Revanth Reddy Press Meet at Tukkuguda : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్​ పార్టీకి ఎంతో ప్రత్యేకమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్​ జనజాతర సభా ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

CM Revanth Reddy Press Meet
CM Revanth Reddy Press Meet at Tukkuguda

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 3:11 PM IST

Updated : Apr 2, 2024, 3:28 PM IST

CM Revanth Reddy Press Meet at Tukkuguda : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్​ పార్టీకి ఎంతో ప్రత్యేకమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది సోనియాగాంధీ వల్లేనని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభా(Congress Jana Jathara Sabha) ప్రాంగణాన్ని సీఎం రేవంత్​ రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈనెల 6న ఇక్కడే జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ముఖ్య నేతలంతా వస్తారని వెల్లడించారు. జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి సీఎం రేవంత్​ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది ఈ సభకు తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు.

గతంలో ఆరు గ్యారంటీలను(Congress Six Guarantees) తుక్కుగూడ సభలోనే ఇచ్చామని గుర్తు చేశారు. ఆరు హామీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేసి చూపించామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, సిలిండర్​, 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ అమలు వంటివి ప్రవేశపెట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్​ పార్టీయేనని కొనియాడారు. మహిళా విభాగానికి సంబంధించిన ఏర్పాట్లను సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు.

కేసీఆర్​ పదేళ్ల పాలన వందేళ్ల విధ్వంసం : ఈ సందర్భంగా పదేళ్ల కేసీఆర్​ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్​ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్​ ధ్వజమెత్తారు. కేసీఆర్​ ఇప్పటికైనా పొలంబాట పట్టడం సంతోషకరమైన విషయమని అన్నారు. పదేళ్ల తర్వాతనైనా రైతులు, వ్యవసాయం ఆయనకు గుర్తుకు వచ్చినందుకు సంతోషకరమైన విషయం అని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక, బిడ్డ జైలుకు వెళ్లాక కేసీఆర్​కు ప్రజలు గుర్తుకు వచ్చారన్నారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్​కు వానకాలం ఎప్పుడు వచ్చేది తెలియదా అంటూ ప్రశ్నించారు.

"కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది డిసెంబరులో వానకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్​ కదా. కేసీఆర్​ చేసిన పాపాలకే గతేడాది వానాకాలం వానలు పడలేదు. కేసీఆర్​, ఆయన కుటుంబం చేసిన పాపాలకు, నేరాలకు బిడ్డ జైలుకు వెళ్లింది. 2019 ఎన్నికల ముందు మినహా కేసీఆర్​ ఏనాడు 10 రోజుల్లో రైతుబంధు పూర్తి చేయలేదు. ప్రతి సీజన్​ రైతుబంధును పూర్తి చేసేందుకు నాలుగైదు నెలలు తీసుకున్నారు." - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

కాంగ్రెస్​ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రత్యేకం : సీఎం రేవంత్​

దిల్లీలోనే సీఎం రేవంత్‌ - ఆ నాలుగు స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు

సీఎం రేవంత్ రెడ్డి​పై డీకే అరుణ సీరియస్​ - ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్

Last Updated : Apr 2, 2024, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details