తెలంగాణ

telangana

ETV Bharat / politics

మేము గేట్లు తెరిస్తే బీఆర్​ఎస్​ ఖాళీ : మణుగూరు సభలో సీఎం రేవంత్​ - CM Revanth Speech in Manuguru Sabha

CM Revanth Participate in Manuguru Public Meeting : ఇందిరమ్మ ఇళ్లు తెలంగాణ పేదలకు దేవాలయాలని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మణుగూరు వేదికగా కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ ప్రజాదీవెన సభలో మాట్లాడిన రేవంత్​ రెడ్డి, ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్​లో కేసీఆర్‌ కుటుంబసభ్యులు తప్ప ఎవరూ ఉండరని, 14 ఎంపీ సీట్లను హస్తం పార్టీ గెలవబోతుందన్నారు.

CM Revanth Participate in Manuguru Public Meeting
CM Revanth Fires on KCR

By ETV Bharat Telangana Team

Published : Mar 11, 2024, 5:48 PM IST

Updated : Mar 11, 2024, 8:26 PM IST

మేము గేట్లు తెరిస్తే బీఆర్​ఎస్​ ఖాళీ : మణుగూరు సభలో సీఎం రేవంత్​

CM Revanth Participate in Manuguru Public Meeting :ఇందిరమ్మ ఇళ్లు తెలంగాణ పేదలకు దేవాలయాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses Scheme) నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మణుగూరులో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ప్రజాదీవెన సభ'లో ప్రసంగించిన రేవంత్​, ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే వేదికపై​ లోక్​సభ ఎన్నికలకు శంఖారావం పూరించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం నెరవేర్చలేదన్న సీఎం, కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలు కలిసి ప్రయత్నిస్తున్నాయని సీఎం ఆరోపించారు. కమలం పార్టీ(BJP) కోసం గులాబీ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నారన్న సీఎం, మోదీ, కేసీఆర్‌ కలిసి హస్తంపై కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ మంచి చేస్తే చూడలేక బీఆర్​ఎస్​ శాపనార్థాలు పెడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

"బీజేపీ, బీఆర్​ఎస్​ ఇవాళ ఒక్కటయై, కాంగ్రెస్​ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్లు ఇప్పటికే తొమ్మిది ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరి ఆ స్థానాల్లో గులాబీ పార్టీ వాళ్లు పోటీలోకి అభ్యర్థులను ఎవర్నీ ప్రకటించటం లేదు. ఎందుకంటే వాళ్లు పోయి ప్రచారం చేసుకోవాలి. అదేవిధంగా బీఆర్​ఎస్ ప్రకటించి నాలుగు స్థానాల్లో బీజేపీ ఎవరికీ ఇంకా టిక్కెట్లను ఖరారు చేయలేదు. వీరి అవగాహన ఎట్లుందో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు."-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారు: సీఎం రేవంత్‌

CM Revanth Reddy Serious Comments on BRS :తాము గేట్లు తెరిస్తే కారు పార్టీలో కేసీఆర్​ కుటుంబసభ్యులు తప్ప ఎవరూ ఉండరని చెప్పారు. ప్రభుత్వంతో పెట్టుకోవద్దని హెచ్చరించిన సీఎం, అలా చేసిన వాళ్లెవరూ మిగల్లేదన్నారు. లక్షా 50 వేల మెజార్టీతో మహబూబాబాద్‌ ఎంపీ(Parliament Election) స్థానంలో కాంగ్రెస్‌ గెలవాలన్న రేవంత్ రెడ్డి, హస్తాన్ని అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలేనన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదన్న మంత్రులు,ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలేనని, ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో హస్తాన్ని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వంలో హామీలను అమలు చేయకుండా కేసీఆర్‌(KCR) మోసం చేశారని దుయ్యబట్టారు. అందుకే ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్​ఎస్​ను 100 మీటర్ల గోతిలో పాతిపెట్టారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాలు గెలవబోతోందని రేవంత్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

'ఇందిరమ్మ ఇళ్లు'పై ప్రభుత్వం కీలక నిర్ణయం - పట్టణ గృహాలకు కేంద్రం సాయం తీసుకోవాలని యోచన

ఎస్ఎల్​బీసీ సొరంగ మార్గం, డిండి ప్రాజెక్టులను 3 సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి

Last Updated : Mar 11, 2024, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details