CM Revanth On KCR Latest News :ఓడిపోయిన తర్వాత కూడా కుటుంబంలోని నలుగురి ఘెష మాత్రమే వినిపిస్తోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వివాదాల పేరుతో వేలాది ఉద్యోగాల భర్తీని గత ప్రభుత్వం నిలిపివేసిందన్న ఆయన, తాము కోర్టు కేసులను పరిష్కరించి నియామక పత్రాలు ఇస్తున్నామని తెలిపారు. నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సచివాలయంలో ఇవాళ సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా (One Crore Insurance Scheme Telangana) పథకాన్ని రేవంత్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో దశాబ్ద కాలంగా కారుణ్య నియామకాలు జరగలేదని చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని అన్నారు.
"కేసీఆర్ కట్టి కూల్చిన వాటిని పునర్ నిర్మించడం గురించి ఆలోచిస్తున్నాం. కుంగిపోయిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎలా ఎత్తిపోయాలో చెప్పమంటే చెప్పట్లేదు. అన్నారం పగిలిపోయి ఉన్న నీళ్లు వృథాగా పోతున్నాయి. కుంగిన మేడిగడ్డ నుంచి పగిలిపోయిన అన్నారంలోకి నీళ్లు ఎత్తిపోయాలని హరీశ్‌రావు చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం వందల టీఎంసీలు తరలించుకుపోతుంటే పట్టించుకోలేదు. ఏపీ సీఎం జగన్‌కు విందు ఇచ్చి ఒప్పందాలు చేసుకొని కృష్ణా జలాలు ఇచ్చారు." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
CM Revanth Comments on KCR Govt :మరోవైపు బీజేపీపైనా రేవంత్ నిప్పులు చెరిగారు. మోదీని మరోసారి ఎందుకు గెలిపించాలో కిషన్ రెడ్డి(Revanth On Kishan Reddy) చెప్పాలని అన్నారు. మద్దతు ధర అడిగిన రైతులను చంపినందుకు మళ్లీ గెలిపించాలా? అని ప్రశ్నించారు. వరదలు వచ్చి హైదరాబాద్ నష్టపోతే కిషన్‌రెడ్డి ఏమైనా కేంద్ర నిధులు తెచ్చారా? అని నిలదీశారు. గత పదేళ్లలో కేసీఆర్, మోదీ కలిసి తెలంగాణకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. గత పదేళ్లలో కేసీఆర్ వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారని ఆరోపించారు. 75 రోజులుగా రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దటం గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు.