తెలంగాణ

telangana

ETV Bharat / politics

జహీరాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్​ భేటీ - CM Revanth Focus on MP Elections - CM REVANTH FOCUS ON MP ELECTIONS

CM Revanth Meeting with Zaheerabad Leaders : లోక్​సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో చక్రం తిప్పేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే జహీరాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి సురేశ్​ షెట్కార్​ గెలుపు వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Lok Sabha Elections 2024
CM Revanth Meet with Zaheerabad Main Leaders

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 3:38 PM IST

CM Revanth Meeting with Zaheerabad Leaders :జహీరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్​ షెట్కార్, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. జహీరాబాద్ పరిధిలోని పార్టీలో చేరికలు, ప్రచారం, ఇతర అంశాలను చర్చించినట్లుగా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details