తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఆ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టండి - కౌంటింగ్​పై కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - CM REVANTH INSTRUCTIONS ON COUNTING - CM REVANTH INSTRUCTIONS ON COUNTING

CM Revanth On Election Counting 2024 : రాష్ట్రం లోక్​సభ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. అసలైన ప్రక్రియ ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్​ రెడ్డి రాష్ట్ర నాయకులతో సమావేశమయ్యారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఏజెంట్​గా వెళ్తున్న ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా 17 సీ లిస్ట్(ఓటర్ల లిస్ట్​) ఉండాలని పేర్కొన్నారు.

Telangana Lok Sabha Counting 2024
Congress Leaders Meeting (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 2:08 PM IST

Congress Leaders Meeting on Election Counting : ఓట్ల లెక్కింపు వేళ పాటించాల్సిన సూచనలపై కాంగ్రెస్‌ నాయకత్వం పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.

CM Revanth Instructions to MP Candidates on Counting : మంగళవారం (జూన్ 4వ తేదీ)న జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా చర్చించారు. కౌంటింగ్‌ ఏజెంట్ల అప్రమత్తతపై దిశానిర్దేశం చేశారు. ఓట్లె లెక్కింపు సమయంలో ఏజెంట్‌లు అధికారులతో వ్యవహరించాల్సిన తీరును నేతలకు వివరించారు. ఏజెంట్​గా వెళ్తున్న ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా 17 సీ లిస్ట్(ఓటర్ల లిస్ట్​) ఉండాలని చెప్పారు.

CM Revanth Reddy on Counting Instructions : హైదరాబాద్​లో ఎంపీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి జూమ్​ మీటింగ్​లో పాల్గొన్నారు. ఎన్నికల లెక్కింపు సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. పోటా పోటీగా ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్​గా పంపించాలని దిశానిర్దేశం చేశారు.

Telangana Lok Sabha Election Counting 2024 : సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోవాలని అన్నారు. ప్రతి రౌండ్​లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్(ఓటరు జాబితా) ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ప్రతి అభ్యర్థి ఈ అంశాలపై అవగాహనతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. లోక్‌సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా జరగనున్న విషయం తెలిసిందే.

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతుందో తెలుసా? ఓట్లు ఎలా లెక్కిస్తారో తెలుసా? - General Elections 2024 Result

ఎన్నికల కౌంటింగ్ ఎలా జరుగుతుంది? స్ట్రాంగ్ రూమ్​లను ఎవరు తెరుస్తారు? అర్హతలేంటి? - How Votes Are Counted

ABOUT THE AUTHOR

...view details