CM Jagan Ongole Tour: ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు రానున్నారు. ఒంగోలులో దాదాపు 20వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ (House Sites Distribution) కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎన్. అగ్రహారం విచ్చేయనున్నారు. సీఎం జగన్ పర్యటన (CM Jagan Tour) దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బందోబస్తు కోసం 17వందల మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే సీఎం సభకు డ్వాక్రా మహిళలంతా రావాల్సిందేనని, పట్టాలు పొందుతున్న లబ్ధిదారులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని మహిళలపై ఆర్పీలు ఒత్తిడి చేస్తున్నారు.
సీఎం సభ కోసం దారి మళ్లింపు- వందల కి.మీ చుట్టూ తిరిగెళ్లాల్సి వస్తోందని లారీ డ్రైవర్ల గగ్గోలు
సీఎం జగన్ సభ కోసం భారీ జన సమీకరణపై అధికార వైసీపీ (YSRCP) దృష్టి పెట్టింది. డీఆర్డీఏ (DRDA), మెప్మా (Mepma) అధికారులు, సిబ్బంది ద్వారా స్వయం సహాయక సంఘ మహిళలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సభకు రాకపోతే పథకాలు ఆగిపోతాయని మహిళలను హెచ్చరిస్తున్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులు కాకున్నా సరే, మహిళలంతా హాజరుకావాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు. స్థలం పొందిన కుటుంబాల్లోని మహిళలకు చీరలు (Sarees), పురుషులకు ప్యాంట్లు (Pants), షర్టులు (Shirts) ఇస్తారంటూ కొన్నిచోట్ల ప్రచారం చేస్తున్నారు.
సీఎం జగన్ సభకు స్కూల్ బస్సులు - సెలవు ప్రకటించిన విద్యా సంస్థలు