ETV Bharat / offbeat

ఇంట్లో చిన్నోళ్లపైనే గారాబం ఎక్కువనేది నిజమేనా? - పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే! - PARENTS LOVE YOUNGEST CHILD

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల తీరుపై పరిశోధన - అధ్యయనంలో పలు కీలక విషయాలు!

Parental Favoritism Youngest Child
Parental Favoritism Youngest Child (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2025, 1:37 PM IST

Parental Favoritism Youngest Child : "అమ్మా - నీకు నాకంటే చిన్నోడంటేనే ఎక్కువ ఇష్టం! వాడు ఏం చేసినా తిట్టకుండా ప్రేమతో దగ్గరికి తీసుకుంటావు. అన్నం తినకపోతే గోరుముద్దలు తినిపిస్తావు! నాన్న - 'నీకు నాకంటే చిన్న చెల్లెలు మీదే ఎక్కువ ప్రేమ! అది ఎంత అల్లరి చేసినా నా బంగారు తల్లీ అంటూ అప్యాయంగా దగ్గరికి తీసుకుంటావు! నన్ను మాత్రం ఎప్పుడూ అంత ప్రేమగా చూడవు! ఇలాంటి ప్రశ్నలను ఏదోక సందర్భాల్లో మనలో చాలా మంది తల్లిదండ్రులను అడిగే ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు అలాంటిదేమీ లేదు. మీరందరూ నాకు సమానమే అని చెబుతుంటారు.

కానీ, తల్లిదండ్రులు తమ సంతానంలో అందరినీ సమానంగా చూడరట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ విషయాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది. పిల్లలందరికన్నా ముఖ్యంగా చివరి సంతానాన్నే ఎక్కువ గారాబం చేస్తారని పేర్కొంది. ఇలా పేరెంట్స్​ మొదటి సంతానంగా జన్మించిన వారికంటే, చివరి వారినే ఇష్టపడడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎక్కువ స్వేచ్ఛనిస్తారు :

చాలా మంది తల్లిదండ్రులు మొదటి సంతానానికి ఎదిగే క్రమంలో కాస్త ఎక్కువ స్వేచ్ఛనిస్తారు. వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారని, సమాజంలో బాధ్యత వ్యవహరిస్తారని, నిర్ణయాలు తీసుకునే సామార్థ్యం ఉంటుందని పేరెంట్స్​ భావిస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎక్కువ గారాబం చేయడంలో తమ చివరి సంతానంవైపే కాస్త మొగ్గు చూపుతారని అధ్యయనం వెల్లడించింది. జెండర్, పుట్టిన క్రమం ఆధారంగా పిల్లల పెంపకంపై పేరెంట్స్​ పోకడను పరిశీలించడానికి ఈ పరిశోధన చేశారు. ఇందుకు 19,500 మందితో సర్వే చేసి తయారు చేసిన 30 నివేదికలు, 14 డేటాబేస్‌లను పరిశీలించారు. ఈ రీసెర్చ్​ వివరాలు సైకలాజికల్‌ బులెటిన్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.

డబ్బు ఎక్కువ ఖర్చుపెడతారు!

ఒక సంతానం కంటే మరొకరిపై ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం, వారితో కాస్త ఎక్కువ టైమ్​ గడపడం వంటి విధానాల ద్వారా పేరెంట్స్​ వివక్షతో కూడిన అభిమానం చూపిస్తారని పరిశోధకులు స్పష్టం చేశారు. చివరిగా పుట్టినవారికి ఇలాంటి ప్రేమ ఎక్కువ దక్కుతోందని నివేదికలో పేర్కొన్నారు. నార్మల్​గా తక్కువ అభిమానం చూరగొంటున్న పిల్లలపై దీర్ఘకాలంలో ఈ ధోరణి కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.

కుమార్తె అంటేనే కాస్త ఎక్కువ లవ్​!

కుమారుడు, కుమార్తె ఉన్నప్పుడు పేరెంట్స్​ ఎవరిపై ఎక్కువ ప్రేమ చూపిస్తారనేదానిపైనా అధ్యయనం దృష్టి పెట్టింది. ఇటువంటి కేసుల్లో ఎక్కువమంది కుమార్తె అంటేనే ఎక్కువ ప్రేమ అని చెప్పినట్లు అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఇంకా తమపట్ల ప్రేమగా ఉంటూ, బాధ్యతాయుతంగా ఉండే పిల్లలను తల్లిదండ్రులు ఎక్కువగా ఇష్టపడతారని వెల్లడించారు.

"పేరెంట్స్​, పిల్లల మధ్య ఉన్న ఈ పోకడలను అధ్యయనం చేయడం ఎంతో అవసరం. ఇలాంటి పరిశోధనలు కుటుంబ జీవితాన్ని సరిదిద్ధడానికి ఉపయోగపడతాయి. జెండర్, వయసు, ప్రవర్తనకు అతీతంగా పిల్లలందరూ తమ అమ్మానాన్నల నుంచి ఒకేరకమైన ప్రేమ, అప్యాయతలను పొందడం చాలా ముఖ్యం." - డాక్టర్​ అలెగ్జాండర్‌ జెన్సెన్‌ (బ్రిగమ్‌ యంగ్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ )

తల్లిదండ్రుల నుంచి మీరు ఎప్పుడైనా, మీ సోదరుడు లేదా సోదరి కంటే తక్కువ ప్రేమను పొందుతున్నారని భావిస్తే ఇలా ఆలోచించండని పరిశోధకులు సూచిస్తున్నారు. 'నేనేమైనా బాధ్యతారహితంగా ఆవేశంతో ప్రవర్తిస్తున్నానా? అందుకే నాతో మాట్లాడటానికి అమ్మానాన్న ఇబ్బంది పడుతున్నారా? ఈ ప్రశ్నలు ఒకసారి మీరు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది!

రాత్రిళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? - వాటి అరుపుల వెనుక కారణాలేంటో తెలుసా?

శ్రీకాకుళం స్పెషల్​ స్వీట్​ "ధనుర్మాస చిక్కీలు" - కేవలం ఈ సీజన్​లోనే లభిస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.