ETV Bharat / state

చంద్రగిరిలో కొనసాగుతున్న గజరాజుల బీభత్సం- ఏనుగుల దాడిలో యువనేత మృతి - ELEPHANT ATTACK IN CHANDRAGIRI

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల దాడిలో టీడీపీ యువ నాయకుడు మృతి-మామిడి తోపులో ఏనుగుల సంచారం ఉందన్న సమాచారంతో గ్రామస్తులతో కలిసి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ చౌదరి

TDP LEADER DIES ELEPHANT ATTACK IN TIRUPATHI
TDP LEADER DIES ELEPHANT ATTACK IN TIRUPATHI (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2025, 1:24 PM IST

Young Leader Dies In Elephant Attack At Tirupathi: చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం కొనసాగుతోంది. గుంపులు గుంపులుగా సంచరిస్తూ స్థానిక ప్రజలను బెంబేలిస్తున్నాయి. దీని వలన అటవీ సమీప ప్రాంత రైతుల్లో తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపులు విచ్చలవిడిగా మామిడి, అరటి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా ఏనుగుల దాడిలో స్థానిక టీడీపీ నేత దుర్మరణం పాలవడం తో గ్రామస్థుల్లో విషాదం చోటు చేసుకుంది.

'తల్లి'డిల్లిన గుండె- గున్న ఏనుగు మృతదేహం వద్ద వేదన- వీడియో వైరల్​! - Mother Elephant Tearful Moment

ఏనుగుల దాడిలో టీడీపీ నాయకుడు మృత్యువాత: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల దాడిలో టీడీపీ యువ నాయకుడు మారూపూరి రాకేశ్ చౌదరి మృతి చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పంచాయతీకి ఉపసర్పంచ్ గా అదే విధంగా ఐటీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడుగా రాకేశ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

ఏనుగు కాళ్ల కిందపడి అక్కడికక్కడే మృతి: మండలంలోని చిన్నరామాపురం, కొంగరవారిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న మామిడి తోటలో ఏనుగుల సంచారం ఉందన్న సమాచారంతో మారుపూరి రాకేశ్ చౌదరి (32) సంవత్సరాలు గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. చీకట్లో ఏనుగుల రాకను గమనించని రాకేశ్, తోటలో ధ్వంసమైన చెట్లను పరిశీలించే సమయంలో అక్కడే ఉన్న ఏనుగులు అతడ్ని కాళ్ల కింద పడేసి తొక్కేసాయి. దీంతో రాకేశ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీనితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఊరేగింపులో ఏనుగుల బీభత్సం- భక్తుల తోపులాట- అనేక మందికి గాయాలు! - Elephant Fight In Kerala Video

సంతాపం తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే: రాకేశ్ మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే దంపతులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని హుటాహుటిన అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఘటన జరిగిన తీరును స్థానికులను, అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏనుగులను తరిమే ప్రయత్నంలో ఈ సంఘటన సంభవించినట్లు వారు ఎమ్మెల్యేకి తెలిపారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

గజరాజులతో రైతులకు దినదిన గండం- పంటలు కాపాడుకోవాలంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? - ELEPHANTS ATTACK

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.