ETV Bharat / international

అమల్లోకి 'సీజ్ ఫైర్' డీల్- హమాస్‌ చెర నుంచి ముగ్గురు ఇజ్రాయెల్​ బందీలు విడుదల - ISRAEL GAZA CEASEFIRE

గాజాలో ఎట్టకేలకు శాంతి - అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం!

Israel Gaza Ceasefire
Israeli PM Benjamin Netanyahu (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 1:35 PM IST

Updated : Jan 19, 2025, 10:10 PM IST

Israel Gaza Ceasefire : గాజాలో ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం 8.30 గంటలకే ఇది అమల్లోకి రావాల్సి ఉండగా దాదాపు మూడు గంటలు ఆలస్యమైంది. ఇజ్రాయెల్‌కు చెందిన ముగ్గురు బందీలను హమాస్‌ విడుదల చేసింది. గాజాకు చేరుకున్న రెడ్‌క్రాస్‌ ప్రతినిధులకు వారిని అప్పగించింది. అనంతరం బందీలతో కలిసి పయనమైన రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు వారిని ఇజ్రాయెల్‌ సైన్యం చెంతకు చేర్చారు. రోమి గోనెన్‌ (24), ఎమిలీ దమారీ (28), డోరాన్‌ స్టెయిన్‌బ్రేచర్‌ (31)లు విడుదలైన వారిలో ఉన్నారు. ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌ పౌరుల్లో ఆనందం నెలకొంది.

గాజాలో ఎట్టకేలకు శాంతి!
అంతకుముందు మూడు గంటలు ఆలస్యంగా గాజాలో శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. హమాస్‌ నుంచి ఇజ్రాయెలీ బందీల జాబితా విడుదలలో జాప్యం కారణంగా ఒప్పందం అమలులో ఆలస్యమైంది. చివరకు నేడు విడుదల చేయనున్న ముగ్గురు బందీల వివరాలను హమాస్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. దీన్ని ఇజ్రాయెల్‌ అంగీకరించడంతో ఎట్టకేలకు ఒప్పందం అమలుకు మార్గం సుగమమైంది. శాంతిస్థాపన చర్యలపై గాజాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పెద్దఎత్తున పాలస్తీనీయులు స్వస్థలాలకు పయనమయ్యారు.

పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్‌- హమాస్‌ ఇటీవల ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే హమాస్‌ చెర నుంచి విడుదల కావాల్సిన బందీల జాబితా అందేవరకు ఒప్పందం అమలుకు ముందుకొచ్చే ప్రస్తకే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హమాస్ ఒప్పందాన్ని ఆలస్యం చేస్తోందని ఇజ్రాయెల్‌ సైన్యం ఆరోపించింది. అందుకే తమ సైన్యం గాజాలో దాడులు కొనసాగిస్తోందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు

ముగ్గురు బందీల పేర్లను హమాస్ విడుదల చేసేంత వరకూ ఒప్పందం అమల్లోకి రాదని హగారీ కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సేనలు గాజాపై దాడులు చేసినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందగా, 25 మంది గాయపడినట్లు వెల్లడించింది. సాంకేతిక కారణాలతో బందీల వివరాలు అందజేయడంలో ఆలస్యమయ్యిందని హమాస్‌ చెప్పింది. ఎట్టకేలకు వివరాలు వెల్లడించడం వల్ల కాల్పుల విరమణ అమలుకు మార్గం సుగమమైంది.

మూడు దశల్లో ఒప్పందం సాగనుండగా, తొలి దశలో 42 రోజులు తాత్కాలిక కాల్పుల విరమణ జరుగుతుంది. ఈక్రమంలో తమ చెరలో ఉన్న 33 మంది బందీలను హమాస్‌ విడుదల చేయనుంది. ఇందుకు ప్రతిగా తమ కారాగారాల్లో ఉన్న 737 మంది పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్‌ విడుదల చేయనుంది. ఖైదీలతో పాటు 2023 అక్టోబరు 7న హమాస్‌ చేసిన దాడులతో సంబంధం లేని 1,167 మంది గాజా వాసులకు కూడా స్వేచ్చ లభించనుంది. తొలి దశలో జనావాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ దళాలు వైదొలగనున్నాయి. భారీస్థాయిలో మానవతా సాయం కూడా గాజాలోకి ప్రవేశించనుంది. రెండో దశలో మిగిలిన బందీలను హమాస్‌ విడుదల చేస్తుంది.

Last Updated : Jan 19, 2025, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.