తెలంగాణ

telangana

ETV Bharat / politics

చేవెళ్లలో ఎగిరిన బీజేపీ జెండా - కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ఘన విజయం - Chevella Lok Sabha Election Results 2024 - CHEVELLA LOK SABHA ELECTION RESULTS 2024

Chevella Lok Sabha Election Results 2024 : చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి తన ప్రత్యర్థి రంజిత్​ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభమైనప్పటి నుంచి స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఆయన, భారీ మెజార్టీతో గెలుపొందారు.

Chevella Lok Sabha Election Results 2024
Chevella Lok Sabha Election Results 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 7:21 PM IST

Chevella Lok Sabha Election Results 2024 : లోక్​సభ ఫలితాల్లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, తన ప్రత్యర్థి రంజిత్​ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభం నుంచి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయిన విశ్వేశ్వర్​ రెడ్డి విజేతగా నిలిచారు. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి 3 పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల మధ్యే నెలకొంది. కాంగ్రెస్​ అభ్యర్థి రంజిత్​ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి చివరకు ఆయనే విజేతగా నిలిచారు. 2019 ఎన్నికల్లో తన ప్రత్యర్థి రంజిత్​ రెడ్డి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన విశ్వేశ్వర్​ రెడ్డి, ఈ ఎన్నికల్లో ఆయనపైనే ఘన విజయం సొంతం చేసుకోవడం గమనార్హం.

తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి. మాజీ ఎంపీగా, తెలంగాణ ఉద్యమకారుడిగా వీటన్నింటి కంటే ధనిక రాజకీయ నేతల్లో ఒకరుగా పేరొందారు. ఇటీవల ఎన్నికల అఫిడవిట్​ సందర్భంగా ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్​ వేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్​లో ఆయన తనకు రూ.4,568 కోట్లు ఉన్నట్లుగా ప్రస్తావించారు. ఈ ఆస్తుల్లో కొండా విశ్వేశ్వర్​ రెడ్డి పేరు మీద రూ.1178.72 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన సతీమణి సంగీతా రెడ్డి పేరు మీద రూ.3203.90 కోట్లు ఉన్నాయి.

ఇదీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ప్రస్థానం :జస్టిస్​ కొండా మాధవరెడ్డి, జయలత దంపతులకు 1960 ఫిబ్రవరి 26 కొండా విశ్వేశ్వర్​ రెడ్డి జన్మించారు. ఆయన ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​లో బీఈ పూర్తి చేశారు. విశ్వేశ్వర్​ రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా వెంకట రంగారెడ్డి మనవడే విశ్వేశ్వర్​ రెడ్డి. ఆంధ్రప్రదేశ్​ మాజీ ఉపముఖ్యమంత్రిగా కూడా వెంకట రంగారెడ్డి పనిచేశారు. విశ్వేశ్వర్​ రెడ్డి తండ్రి కూడా ఏపీ, మహారాష్ట్ర హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

రాజకీయ ఆరంగేట్రం :తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు కొండా విశ్వేశ్వర్​ రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్​ ఆహ్వానం మేరకు 2013లో ఆ పార్టీలో చేరారు. అనంతరం 2014 లో ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పి కాంగ్రెస్​ పార్టీలో చేరారు. కాంగ్రెస్​ పార్టీలో నాయకత్వం లోపం ఉందని భావించిన విశ్వేశ్వర్​ రెడ్డి 2021 మార్చిలో కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. అనంతరం 2022లో బీజేపీలో చేరి అనతి కాలంలోనే కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details