ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంతం నెగ్గించుకున్న చంద్రబాబు - ఆనందోత్సాహాల్లో టీడీపీ శ్రేణులు - CBN Again CM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 11:19 AM IST

Updated : Jun 4, 2024, 11:37 AM IST

CBN Again CM : ముఖ్యమంత్రిని అయ్యాకే మళ్లీ సభలో అడుగుపెడతానన్న చంద్రబాబు మరోసారి సీఎం కాబోతుండడంపై టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా జరిగిన అవమానానికి బదులుగా ప్రజలు చంద్రబాబును ఆశీర్వదించి మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపిస్తున్నారంటూ గుర్తు చేసుకుంటున్నాయి.

cbn_again_cm
cbn_again_cm (ETV Bharat)

CBN Again CM :ముఖ్యమంత్రిని అయ్యాకే మళ్లీ సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేసిన సందర్భాన్ని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ ప్రజలు చంద్రబాబును ఆశీర్వదించి మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపిస్తున్నారంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నాయి.

పంతం నెగ్గించుకున్న చంద్రబాబు (ETV Bharat)

"ముఖ్యమంత్రిని అయ్యాకే మళ్లీ సభకు వస్తాను తప్ప నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇదొక కౌరవ సభ. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించమని కోరుతున్నా." ఏపీ అసెంబ్లీలో జరిగిన అవమానంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.

2021 నవంబర్​ 19. ఆ రోజు రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్​ మైక్​ కట్​ చేశారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు ఒక్కసారిగా బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో తెలిపారు.

ఏపీలో కూటమి సునామీ - 150కు పైగా స్థానాల్లో దూసుకుపోతున్న అభ్యర్థులు - AP Election Result

తన రాజకీయ జీవితంలో ఏనాడు, ఎవ్వరినీ అవమానించేలా మాట్లాడలేదని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగలేదని, అధికారం పోయినప్పుడు కుంగిపోలేదని పేర్కొన్నారు. ఎవ్వరి పట్లా అమర్యాదగా ప్రవర్తించలేదు కానీ ఇవ్వాళ నా భార్య గురించి అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడిన భాష నీచంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. ఎనిమిదిసార్లు ఎన్నికైన తన అనుభవంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని అంతకు ముందు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదంతా గమనిస్తుంటే "మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా?" అని చెప్పిన తమిళ్ సూపర్​ స్టార్​ రజనీకాంత్​ డైలాగ్స్ గుర్తొస్తున్నాయి.

ఓటమి బాటలో వైఎస్సార్సీపీ - కౌంటింగ్​ ​కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న అభ్యర్థులు - YSRCP Leaving Counting Center

Last Updated : Jun 4, 2024, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details