ETV Bharat / politics

డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - త్వరలో మంత్రివర్గ విస్తరణ !

తెలంగాణలో డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు - అప్పుడే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం

TELANGANA ASSEMBLY SESSIONS
ASSEMBLY SESSION HELD ON DEC 9TH IN TELANGANA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Telangana Assembly Winter Session 2024: తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరు 9 నుంచి జరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టం చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గురువారం (నవంబర్ 21)న అంబేడ్కర్​ సచివాలయంలోని మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రైతుల సమస్యలన్నింటికీ చరమగీతం పాడేందుకు కొత్త ఆర్వోఆర్‌ (రికార్డ్​ ఆఫ్​ రైట్స్) చట్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీనిపై సభలో చర్చ పెట్టనున్నట్లు పేర్కొన్నారు.

అడ్డగోలుగా భూసేకరణ: రంగనాయకసాగర్‌ భూసేకరణ నోటిఫికేషన్‌తో రైతుల నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు భూములు కొనుగోలు చేశారనేది స్పష్టమవుతోందని తెలిపారు. అయితే భూములు తీసుకుని నోటిఫికేషన్‌ను రద్దు చేశారన్నారు. కానీ దీనికి క్రమబద్ధమైన ప్రక్రియను గత ప్రభుత్వం అనుసరించలేదని ఆయన అన్నారు. హరీశ్‌రావు నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారో లేదో విచారణలో అన్నీ నిరూపిస్తామన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి నోటిఫికేషన్‌ జారీ చేశాక రద్దు చేయడం అనేది అంత సులువైన పని కాదని, వైఎస్‌ రాజశేఖర్​ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోపన్‌పల్లి భూములను భూసేకరణ నోటిఫికేషన్‌ ద్వారా సేకరించారన్నారు. అవి ఇప్పటికీ ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయని గుర్తు చేశారు.

కేటీఆర్​కు కౌంటర్​ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడి డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతోంది. అప్పటికి మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో విద్యుత్‌ కమిషన్‌, ఈ-కార్‌ అంశాలపై సమగ్రంగా చర్చ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కుటుంబ సర్వేల గురించి సభలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పొంగులేటి తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఈలోగానే ఆసరా పింఛన్లు, రైతు భరోసా అమలుకు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ప్రభుత్వంలో నేను 11వ స్థానంలో కొనసాగుతున్నానని, 2వ స్థానంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అని మంత్రి పొంగులేటి జవాబిచ్చారు. పలుమార్లు కేటీఆర్​ పొంగులేటిని 2వ స్థానం మంత్రి అని వ్యాఖ్యానించగా దానికి కౌంటర్ వేశారు.

ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరించదు : ప్రభుత్వం ఏ విషయంలోనూ తొందరపడటం లేదని మంత్రి పొంగులేటి చెప్పారు. అన్ని అంశాలపై పూర్తి ఆధారాలు సిద్ధమయ్యాకే చర్యలు ఉంటాయన్నారు. కేటీఆర్‌ అరెస్టు విషయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపణలపై స్పందించారు. కేటీఆర్​పై కేసు నమోదు అంశం గవర్నర్​ ప్రస్తావనలో ఉందని ఆయన తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ న్యూ రికార్డ్ - ఏకధాటిగా 17 గంటల పాటు చర్చ - తెల్లవారుజాము 3.15 గంటల వరకు సమావేశాలు - TELANGANA BUDGET SESSION NEW RECORD

'బీఆర్ఎస్​ కార్యకర్తలే మంత్రి సురేఖపై ట్రోలింగ్​ చేశారు - సంస్కారహీనంగా ఆ పార్టీ సోషల్​ మీడియా పోస్టులు' - raghunandan rao on Minister Trolls

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.