Minister Nimmala on Polavaram Project: 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. నిర్ణీత గడువులోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. పోలవరంలో రూ.436 కోట్లతో తాము నిర్మించిన డయాఫ్రం వాల్ వైఎస్సార్సీపీ నిర్వాకం కారణంగా ధ్వంసమైందని అన్నారు. ఏజెన్సీలను మార్చవద్దని కోరినా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఫలితంగా 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి తెలిపారు.
రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించుకోవాల్సిన పరిస్ధితి వచ్చిందని మంత్రి అన్నారు. జనవరిలో డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించి 2026 మార్చికల్లా పూర్తి చేస్తామని వివరించారు. టీడీపీ హయాంలో పోలవరం నిర్మాణం కోసం రూ.11,762 కోట్లు ఖర్చు పెట్టగా వైఎస్సార్సీపీ హయాంలో కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన రూ.3385 కోట్ల నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించారని ఆరోపించారు.
అదిరిన సీన్ - పవన్ను ఆలింగనం చేసుకున్న బొత్స - ముఖం చాటేసిన పెద్దిరెడ్డి
జగన్ కాపులు, బ్రహ్మణుల ద్రోహి : ఆర్థికంగా వెనుకబడిన బలహీనవర్గాల సంక్షేమంపై శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి సవిత జగన్ కాపులు, బ్రహ్మణుల ద్రోహి అని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రతిగా టీడీపీ సభ్యులు సైతం నిరసనకు దిగారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
8 బిల్లులకు ఆమోదముద్ర: శాసనసభలో ఆమోదించిన 8 బిల్లులకు శాసన మండలి ఆమోదముద్ర వేసింది. చెత్తపన్ను రద్దు బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, సహజవాయు వినియోగంపై జీఎస్టీ తగ్గింపు బిల్లు, హిందూ ధార్మిక, మత సంస్థలు, దేవదాయ చట్టసవరణ బిల్లు, జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ బిల్లు, పీడీ చట్ట సవరణ బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
ప్రభాస్ ఎవరో నాకు తెలియదు - నేను ఇంత వరకూ ఆయన్ను చూడలేదు : షర్మిల
తప్పు చేసి 'సారీ' అంటే ఊరుకుంటామా? - ఏ ఒక్కరినీ వదిలేదిలేదు : లోకేశ్