No CCTV Cameras in Areas Near Vijayawada Railway Station : నాలుగు రోజుల క్రితం రైల్వే యార్డులోని ఏసీ బోగీలో మద్యం తాగిన బ్లేడ్ బ్యాచ్ ఆ మత్తులో సీటుకు నిప్పంటించారు దీంతో మూడు బెర్తులు కాలిపోయాయి. అనంతరం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురిపై, వన్‌టౌన్ తారాపేట వద్ద మరొకరిపై బ్లేడ్ బ్యాచ్ దాడికి పాల్పడ్డారు.
- కృష్ణానది రైలు వంతెన వద్ద 15 రోజుల క్రితం రైలు ఔటర్ నిలిపి ఉండగా తలుపు వద్ద కూర్చున్న ప్రయాణికుడిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో దాడి చేసి చరవాణి లాక్కున్నాడు. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- మూడు నెలల క్రితం ఓ లోకో పైలెట్ విధుల్లో భాగంగా అర్ధరాత్రి షంటింగ్ ఇంజిన్ కోసం యార్డుకు వెళ్తుండగా గంజాయి మత్తులో ఓ వ్యక్తి అతడిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
- ఖుద్గూస్ నగర్ రోడ్డులో ఆరు నెలల క్రితం కొందరు గంజాయి మత్తులో విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌పైనే దాడికి పాల్పడ్డారు.
- ఇలా ఎన్నో సంఘటనలు రైల్వే పరిసరాల్లో చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి ఆయా ప్రాంతాల్లో భద్రత నామమాత్రంగా ఉంది. పోలీసుల పర్యవేక్షణ లోపించడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన బ్లేడ్, గంజాయి బ్యాచ్ రైల్వే యార్డు పరిసరాల్లో మద్యం తాగడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
బెజవాడ బస్టాండ్‌లో భద్రతా వైఫల్యం - బ్లేడ్ బ్యాచ్, గంజాయి మూకలు హల్చల్ - Pandit Nehru Bus Station
తమ పరిధి కాదంటూ : విజయవాడ రైల్వే స్టేషన్‌కు సమీపంలో కీలకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు సరిగా లేవు. దీంతో ఏదైనా జరిగితే ఎవరు చేశారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే స్టేషన్ పరిసరాలు సత్యనారాయణపురం, కృష్ణలంక, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. రైల్వే పరిసరాల్లో శాంతి భద్రతలు, చోరీలను అరికట్టాల్సిన జీఆర్పీ స్టేషన్‌లో సిబ్బంది కొరత ఉంది. దీంతో రోజుకో సంఘటన జరుగుతుంది. రైల్వే పరిసరాలు మూడు స్టేషన్ల పరిధి ఉండడంతో ఏదైనా జరిగితే పోలీసులు తమ పరిధి కాదంటూ చెబుతున్నారు.
![No CCTV Cameras in Areas Near Vijayawada Railway Station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/23499154_no-cctv-cameras-in-areas-near-vijayawada-railway-station.jpg)
దాడులకు పాల్పడే బ్లేడ్, గంజాయి బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే డీఎస్పీ రత్నరాజు తెలిపారు. రైల్వే యార్డులోనూ నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణానది రైలు వంతెన, ఖుద్గూస్ నగర్ లోకో షెడ్డు, తారాపేట, పార్సిల్ కార్యాలయం, ఆర్‌ఈ కాలనీ, నాపరాళ్ల డిపో వద్ద రాత్రి వేళ్లలో పోలీసులను నియమిస్తామని, రాత్రి సమయాల్లో రైల్వే సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
'గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల బారి నుంచి మా కాలనీని కాపాడండి' - Ganjai Blade Batch in Vijayawada