ETV Bharat / state

'మా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు' అసలేం జరిగుంటుంది! - RETIRED HEAD CONSTABLE COUPLE DEAD

తిరుపతిలోని అబ్బన్న కాలనీలో విశ్రాంత హెడ్‌ కానిస్టేబుల్‌ దంపతులు ఆత్మహత్య

retired_head_constable_couple_dead_in_tirumala
retired_head_constable_couple_dead_in_tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 11:28 AM IST

Retired Head Constable Couple Dead In Tirumala : తిరుమలలో విశ్రాంత హెడ్‌ కానిస్టేబుల్‌ దంపతులు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. తిరుమల టు టౌన్‌ పోలీసుల వివరాల మేరకు తిరుపతిలోని అబ్బన్న కాలనీలో విశ్రాంత హెడ్‌ కానిస్టేబుల్‌ వి.శ్రీనివాసులు నాయుడు(60), సతీమణి వి.అరుణ(50) నివాసం ఉంటున్నారు. వీరికి జయశ్రీ అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవలే కుమార్తె, అల్లుడు శ్రీకాంత్‌ యూకే నుంచి ఇండియా వచ్చారు. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వి.శ్రీనివాసులునాయుడు దంపతులు గురువారం రాత్రి తిరుమల చేరుకుని స్థానిక నందకం అతిథిగృహంలో 203 గదిలో బస చేశారు.

తణుకులో కలకలం - తుపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

రాత్రి శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని కుమార్తె, అల్లుడికి తెలిపారు. ఇంతలో ఏమైందో ఏమో శుక్రవారం చూసే సరికి వారిద్దరూ గదిలోని ఫ్యాన్లకు చీరలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గది తీసుకున్న సమయం మించిపోతుండటంతో అటెండర్‌ తలుపు తట్టాడు. తీయకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చాడు. విజిలెన్స్‌ అధికారులు గది లోపల చూడగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

'ఆత్మహత్య ఆలోచనలు తినేస్తున్నాయ్‌ - ఎవరికీ చెప్పలేను'

తిరుమల టూ టౌన్‌ పోలీసులు మృతదేహాలను తిరుపతి రుయాకు తరలించారు. గదిలో ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తెలిపినట్లు పేర్కొన్నారు. శ్రీనివాసులునాయుడు అనారోగ్యంతో రెండేళ్ల కిందటే వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు. జంట ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తప్పు చేశాడు- భయంతో ఉరేసుకున్నాడు

మోసపోయానని ఒకరు - పరువు పోతుందని మరొకరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.