CBI Remand Report on MLC Kavitha Custody : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇటీవల కస్టడీకి తీసుకున్న సీబీఐ, గడువు ముగియడంతో నేడు తిరిగి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన ఆధారాలను కవిత ధ్వంసం చేయడం, చెరిపేసే అవకాశం ఉందని ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించాలంటూ 11 పేజీలతో న్యాయస్థానంలో అప్లికేషన్ దాఖలు చేసింది. ఈ రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది.
Delhi Liquor Scam Case Updates : కవిత కస్టడీలో విచారణకు సహకరించలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. శరత్‌చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్లపై ఆమెను ప్రశ్నించామని పేర్కొంది. లేని భూమి ఉన్నట్టుగా చూపిన అమ్మకంపై కవిత నుంచి ఎలాంటి సమాధానం లేదని వివరించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారని వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు, బుచ్చిబాబుతో జరిగిన సమావేశాలు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్‌తో మీటింగ్‌లపై ప్రశ్నించినా సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని ఆరోపించింది.
మరోసారి తిహాడ్ జైలుకు కవిత - ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ