KTR Tweet on CM Revanth About Niti Aayog Meeting Boycott : కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాలకు దూరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన న్యాయమైన సమస్యల కోసం గతంలో సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ప్రధానితో సమావేశాలను బహిష్కరిస్తే, కాంగ్రెస్ తప్పుబట్టిందని గుర్తుచేశారు.
నీతిఆయోగ్ భేటీని రేవంత్ బహిష్కరిస్తున్నప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ సమాధానం ఏంటి?: కేటీఆర్ - KTR On Niti Aayog Meeting Boycott - KTR ON NITI AAYOG MEETING BOYCOTT
Telangana Govt Boycott Niti Aayog Meeting : నీతి అయోగ్ సమావేశాలకు హాజరుకాబోమని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ, నీతి అయోగ్ సమావేశాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా బహిష్కరిస్తున్నప్పుడు ఆ పార్టీ ఏం చెబుతుందని ప్రశ్నించారు.
Published : Jul 26, 2024, 9:46 AM IST
|Updated : Jul 26, 2024, 10:12 AM IST
గతంలో భేటీకి వెళ్లకున్నా బీఆర్ఎస్, బీజేపీతో కలిశామని ఆరోపించారని ధ్వజమెత్తారు. సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండటానికి ఆ రెండు పార్టీలు కుమ్మక్కు కావటమే కారణమంటూ విమర్శించారని పేర్కొన్నారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తే కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. చోటా భాయ్ రేవంత్‌రెడ్డి, ప్రధానమంత్రిని కలవాలని, రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సమస్యల గురించి మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదన్నారు.