KTR Fires on Congress About Job Calendar : కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్‌తో యువతను మభ్య పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ శాసనసభ ఎదుట ఉన్న గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదన్నారు. రెండు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని విమర్శించారు.
"నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటనలు చేశారు. రాహుల్ గాంధీ, 2లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎక్కడ? సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే అశోక్‌నగర్ రావాలి, మేము కూడా వస్తాము. నిరుద్యోగులు ఒక్క ఉద్యోగం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే, మా ఎమ్మెల్యేలందరం రాజీనామా చేసి అక్కడే పెట్టి పోతాం. దొంగచాటున ఏదో రాసుకుని వచ్చి జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. రాష్ట్ర యువత తరఫున పోరాడుతుంటే మమ్మల్ని తిడుతున్నారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వ్యక్తికి మైక్ ఇచ్చి శాసనసభను కౌరవ సభగా మార్చారు."-కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Harish Rao Protest Against Assembly Proceedings : శాసనసభ దుశ్సాసన సభగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వం తప్పు ఎత్తి చూపితే మైకు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. కన్న తల్లులను అవమానపరిచేలా ఒక శాసన సభ్యుడు మాట్లాడితే మైక్ ఎందుకు కట్ చేయరని ప్రశ్నించారు. దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారముందని అసెంబ్లీలో మా గొంతు నొక్కితే, ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వెల్లడించారు.