BRS Nalgonda MP Candidates :నల్గొండ, భువనగిరి స్థానాలకు పలువురు సీనియర్ నేతలు పోటీ పడినా సుదీర్ఘ కసరత్తు తర్వాత రెండు స్థానాలకు కంచర్ల కృష్ణారెడ్డిని, క్యామ మల్లేశ్‌ను కేసీఆర్ ప్రకటించారు. నల్గొండ నుంచి పోటీ చేసేందుకు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి ముందు నుంచి ఏర్పాట్లు చేసుకోగా వివిధ కారణాలతో ఆయన మధ్యలోనే తప్పుకున్నారు. మొదటి నుంచి పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టిక్కెట్ వరించింది. నల్గొండ స్థానానికి ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది.
Bhuvanagiri BRS MP Candidate :భువనగిరి స్థానాన్ని బీసీలకు కేటాయిస్తారనే ప్రచార నేపథ్యంలో ఇక్కడి నుంచి బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టిక్కెట్ ఇచ్చామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి ఎంపీ టిక్కెట్ క్యామ మల్లేష్‌కు దక్కడంతో ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశించిన జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ తదితరులు ఏ మేరకు పార్టీకి సహకారం అందిస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఈ రెండు పార్లమెంటు స్థానాలకు పార్టీ ఇన్‌ఛార్జీ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యవహరించనున్నారు. తమను గుర్తించి పార్టీ టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్‌కు (KCR ON Lok Sabha Elections) కృష్ణారెడ్డి, మల్లేష్ వేర్వేరుగా కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ - Hyderabad BRS MP Candidate