తెలంగాణ

telangana

ETV Bharat / politics

ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ నేతలు - గ్యారంటీల అమలు విఫలమే ఆయుధం - Brs mp candidates campaign - BRS MP CANDIDATES CAMPAIGN

BRS Leaders Election Campaign : లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్ సత్తా చాటేందుకు ఎంపీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలును కాంగ్రెస్ పార్టీ మరచిందని విమర్శిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Lok Sabha Elections Campaign 2024
BRS Candidates Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 1:16 PM IST

ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ నేతలు గ్యారంటీల అమలు విఫలమే ఆయుధం

BRS Candidates Election Campaign :అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్​, లోక్​సభ ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు అంశాన్ని ఆయుధంగా చేసుకుని ప్రచారంలో దూసుకుపోతోంది. అధికారం వచ్చిన అనంతరం కాంగ్రెస్ మరచిందని, 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ఇప్పుడు వాటికి లోక్​సభ ఎన్నికలను లింక్​ చేస్తున్నారని విమర్శించారు.

BRS Koppula Eshwar Election Campaign :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్​ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కార్మిక బిడ్డగా ఆదరించి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే 2వ బొగ్గు గనిపై టీబీజీకేస్ కార్మిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గని ఆవరణలో ఉదయం షిఫ్ట్ విధులకు వెళుతున్న కార్మికులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. కనీసం గతంలో ఉన్న సంక్షేమ పథకాలను కూడా కొనసాగించడం లేదని ఆరోపించారు. ప్రధానంగా సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఘనత ఒక బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్​కు 10 సీట్లు ఇస్తే- ఏడాదిలో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది : కేటీఆర్ - KTR meeting with party workers

"44 పేజీల్లో 420 హమీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ సారి తప్పకుండా బీఆర్​ఎస్​, కేసీఆర్​కు మద్దతు ఇవ్వాలని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ గత పదిసంవత్సరాలుగా కరెంటు కోత ఎప్పుడు లేదు ఇప్పుడు ఉంటుంది. పది సంవత్సరాలుగా తాగు నీటి సమస్య లేదు కానీ ఐదు నెలల్లో ఇన్ని ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు." - నామ నాగేశ్వరరావు, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి

Lok Sabha Elections Campaign 2024 :గత నెల రోజులుగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్ఎస్​ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. జనసముహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉదయం ఖమ్మం పెద్ద కూరగాయల మార్కెట్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైందని ప్రజలు చెబుతున్నారని ఆయన అన్నారు. కరెంటు కోతలు, నీటి కష్టాలు ప్రారంభమయ్యాయని ప్రజలు వాపోతున్నారని చెప్పారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RS Praveen Kumar Election Campaign in Nagar kurnool :కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారంటీలవల్ల ప్రజలు రోడ్డు మీద పడ్డారని నాగర్ కర్నూల్ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మార్నింగ్ వాక్​లో భాగంగా ఆయన, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు మేలు చేసిందన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం బీఆర్​ఎస్​ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కోతలు, తాగునీటి సమస్యలు మెుదలయ్యాయని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతులకు కాంగ్రెస్‌ కమీషన్లు అడుగుతోంది : కేసీఆర్‌ - KCR Bus Yatra in Warangal

బీజేపీ, కాంగ్రెస్​ల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు : బాజిరెడ్డి గోవర్థన్ - NIZAMABAD BRS MP CANDIDATE CAMPAIGN

ABOUT THE AUTHOR

...view details