Harish Rao Slams Minister Komatireddy :బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించారు. జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలనే ఆలోచనలతో కేసీఆర్ హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటుకు నాంది పలికారని అన్నారు.
Harish Rao On LB Nagar TIMS Hospital :కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంఐదు నెలలుగా ఆసుపత్రుల నిర్మాణాలు, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసి, లేని పోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఆసుపత్రులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా ఆర్ అండ్ బీ శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
'తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరం' - Harish Rao on Congress Government
టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే 27 అంతస్తులు అని మాట్లాడటం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని హరీశ్ రావు అన్నారు. ఎక్కువ అంతస్తులు ఉంటే రోగులు ఇబ్బంది పడతారని మొసలి కన్నీరు కార్చుతున్న మంత్రికి, జైపుర్‌లో నాటి రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేపట్టిన 24 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు.
నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని హరీశ్ రావు కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని, తమపై విమర్శలు మాని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేసింది : హరీశ్ రావు - Harish Rao Comments Congress Govt
సీఎం రేవంత్ రెడ్డి భ్రమలు వదిలేసి పాలనపై దృష్టి పెడితే మంచిది : హరీశ్ రావు - Harish Rao tweet on Employee