KTR Tweet On MP Prajwal Revanna Sex Scandal: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు రేవణ్ణతో పాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఎలా అనుమతిస్తారని, ఇందులో కేంద్ర సహకారం లేకుంటే వెంటనే స్వదేశానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అతడిపై చట్టపరమైన విచారణ చేపట్టాలని సూచిస్తూ తన అధికార ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
KTR On Hassan Sex Scandal :'మణిపుర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కేంద్రం చూసీ చూడనట్లుగా కళ్లు మూసుకుంది. బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి విడుదల చేశారు. ఇక బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలను పట్టించుకోలేదు. ఇప్పుడు కన్నడనాట హాసన్ సెక్స్ స్కాండిల్లోనూ కేంద్రం తీరు అలాగే ఉంది. ఈ విషయాన్నీ చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోంది.' అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు.
బీజేపీ అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉంది : కేటీఆర్ - KTR ON BJP RESERVATION COMMENTS
అసలు ఏం జరిగిందంటే :ఇటీవలే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యాజేడీఎస్ పార్టీకి చెందిన కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు వైరల్‌గా మారాయి. మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ తనయుడు రేవణ్ణతో పాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ప్రజ్వల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ హోళెనరసిపుర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
అశ్లీల వీడియోలపై సమగ్ర విచారణకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు. వీడియోల్లో ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నట్టు ఉన్నదని ఆయన తెలిపారు. కుట్రలో భాగంగానే నవీన్ గౌడ అనే వ్యక్తి మార్ఫింగ్ చేసిన వీడియోలను ప్రచారం చేస్తున్నట్టు తన ఎన్నికల ఏజెంట్ ద్వారా ప్రజ్వల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కర్ణాటక మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. రేవణ్ణ పేరు చెడగొట్టడానికే కొంత మంది కలిసి ఈ క్లిప్‌లను వ్యాప్తి చేశారని జేడీఎస్- బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల కేసు విషయంలో ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ నెల 27న ప్రజ్వల్ జర్మనీ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు.
బీఆర్ఎస్కు 10 సీట్లు ఇస్తే- ఏడాదిలో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది : కేటీఆర్ - KTR meeting with party workers
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు- పార్టీ పుట్టుకే సంచలనమన్న కేటీఆర్ - BRS Formation Day celebrations