తెలంగాణ

telangana

ETV Bharat / politics

'సీఎంకు బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా? - పండుగపూటా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా' - KTR Fires on CM Revanth Reddy - KTR FIRES ON CM REVANTH REDDY

బ్లీచింగ్​ పౌడర్​ కొనడానికి, చెరువు కట్ట మీద లైట్లు పెట్టడానికి పంచాయతీల్లో పైసల్లేని పరిస్థితులు : కేటీఆర్

BRS Leader KTR Fires on CM Revanth Reddy
BRS Leader KTR Fires on CM Revanth Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 11:46 AM IST

BRS Leader KTR Fires on CM Revanth Reddy : ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా? అని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్​ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ట్వీట్​ చేశారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురావట్లేదా అని ప్రశ్నించారు. పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా అంటూ కేటీఆర్​ ధ్వజమెత్తారు.

చెత్తా, చెదారం మధ్య మురికి కంపులో మన అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాలా అని కేటీఆర్​ ధ్వజమెత్తారు. బ్లీచింగ్​ పౌడర్​ కొనడానికి, చెరువు కట్ట మీద లైట్లు పెట్టడానికి పంచాయతీల్లో పైసల్లేని పరిస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చిందని ఆవేదన చెందారు. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను స్వచ్ఛమైన పరిసరాల్లో చేసుకునే భాగ్యం కూడా మహిళలకు లేదా అని అడిగారు. బతుకమ్మ చీరలను రద్దు చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అంటూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎంకు కేటీఆర్​ ప్రశ్నల వర్షం సంధించారు.

మూసీ నది వెనుక దాక్కున్న ముసుగు దొంగలు ఎవరు : మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవరని కేటీఆర్​ మరో ట్వీట్​లో ప్రశ్నించారు. ఇలా పలు ప్రశ్నలను రాష్ట్ర ప్రభుత్వానికి సంధించారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరని అడిగారు. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరని ప్రశ్నించారు. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2,500 ఇస్తానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్న మోసగాడు ఎవరని ఆయన అడిగారు.

అవ్వ, తాతలకు నెలకు రూ.4000 ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరని కేటీఆర్​ అడిగారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తానని మాట తప్పిన దగావీరుడు ఎవరని ప్రశ్నించారు. మూసీ బ్యూటిఫికేషన్​ పేరిట రూ.1.50 లక్షల కోట్ల లూటిఫికేషన్​కి తెరతీసిన ఘనుడు ఎవరని కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

పనిలేక చేనేత కార్మికుల అవస్థలు - నిలిచిన బతుకమ్మ చీరల తయారీ

''గంగ'కు రూ.17 కోట్లు, మూసీకి రూ.2700 కోట్లా? - ఇది బ్యూటిఫికేషన్​ కాదు, లూటిఫికేషన్'​ - KTR SLAMS THE TG GOVT

ABOUT THE AUTHOR

...view details