BRS Leader Harish Rao On crop drought in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందని, కరవు మొదలైందని, రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందన్న ఆయన, గడ్డి కేంద్రాలను పెట్టి పశువులను కాపాడుకునే స్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరవే లేదని గుర్తు చేశారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలన్నారు, కానీ అమలు కాలేదని విమర్శించారు.
"వెంకట రామిరెడ్డి గెలుపు చాలా ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏపాటిదో ప్రజలకు అర్థమైంది. వైఎస్ ఉన్నపుడు ఆరు గంటల కరెంటు ఇస్తే, రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి కెసిఅర్ 24 గంటల కరెంట్ ఇచ్చారు. సాగు నీటి కష్టాలు తొలగించింది కేసీఆర్. అప్పుడు నిండా చూసిన జలాశయాలు, ఇప్పుడు ఎండిపోయి చూస్తున్నాం. గడ్డిని కూడా నాడు ఆంధ్ర నుంచి తెచ్చి పశువులను కాపాడుకున్నం. కేసిఆర్ కాలు పెడితే పదేళ్లు కరువు లేదు. కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరువు తెచ్చింది. ఏ ఒక్క హామిని కాంగ్రెస్ నెరవేర్చలేదు. మీరు మాకు ఎంపి సీట్లు ఇస్తే హామీల గురించి నిలదీస్తాం." - హరీశ్ రావు, మాజీ మంత్రి
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీ ఏమైనట్టు : కేటీఆర్ - KTR On Congress BC Declaration
BRS Harish Rao Election Campaign in Medak :బీజేపీ నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు నష్టం చేసిందని హరీశ్ రావు అన్నారు. ఉపఎన్నికలో వారు అనేక హామీల పేరిట అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు. దుబ్బాకలో చెల్లని వ్యక్తి ఇక్కడ ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎన్నడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి అలాంటి వారు సీఎం అయ్యారన్నారు. జై తెలంగాణ అనే వాళ్లను కాల్చి పడేస్తా అన్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లు వచ్చి పంటలు పండితే ముద్ద తింటున్నామని, నోటి కాడ బుక్క పోగొడుతున్నారని విమర్శించారు. నిజమైన రైతు నేస్తం కేసీఆర్ అని అన్నారు.