BRS Chief KCR Election Campaign at Kothagudam : రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తోందని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, మరి ఎందుకు ఈడీ, ఐటీలతో విచారణ జరిపించడం లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వెంటనే ఈ విషయంపై ఈ రెండు సంస్థలను మోదీ రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. మహబూబాబాద్ లోక్సభ నుంచి మాలోతు కవితను, ఖమ్మం లోక్సభ నుంచి నామ నాగేశ్వరరావును గెలిపించాలని కేసీఆర్ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో మత విద్వేషాలు లేకుండా పరిపాలన చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని స్పష్టం చేశారు. వీరిద్దరిలో ఎవరికి ఓటేసిన గోదావరిలో వేసినట్లు తప్పా రాష్ట్రానికి ఏం లాభం లేదంటూ కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలోనే ఎక్కువగా పోడు పట్టాలను అందించామని తెలిపారు. అలాగే రైతుబంధు, రైతుబీమాలను కల్పించాలమన్నారు. ఎన్నికల్లో గెలిచారు కదా రైతుబంధు ఎవరికైనా వచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
"డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తోందని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, మరి ఎందుకు ఈడీ, ఐటీలతో విచారణ జరిపించడం లేదు. బీఆర్ఎస్ పాలనలో మత విద్వేషాలు లేకుండా పరిపాలన చేశాము. వీరిద్దరిలో ఎవరికి ఓటేసిన గోదావరిలో వేసినట్లు తప్పా రాష్ట్రానికి ఏం లాభం లేదు." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత