BRS Cantonment MLA Candidate :కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరును బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. పార్టీ ముఖ్యనేతలు, స్థానిక నాయకులతో చర్చించిన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమె పేరును ప్రకటించారు. 2023 ఎన్నికల్లో అక్కడినుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభ ఎన్నికలతో(LOk Sabha Polls) పాటే కంటోన్మెంట్ ఉపఎన్నిక కూడా జరగనుంది.
KCR Announced Cantonment MLA Candidate :కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై(Cantonment By poll) ఆదివారం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ అభ్యర్థి(BRS Cantonment Candidate)గా ఎవరిని బరిలో దించాలనే దానిపై సమావేశంలో చర్చించారు. ఈ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పుడు బీఆర్‌ఎస్ కూడా నివేదిత పేరును ఖరారు చేయడంతో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై అందరి దృష్టి ఉంది.
Lasya Nanditha Died : ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి(Lasya Nanditha Died) చెందారు. రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సరిగ్గా ఏడాది క్రితమే లాస్య నందిత తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న సరిగ్గా ఏడాది క్రితం మృతి చెందారు. ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరి గుండెపోటు రావడంతో 2023 ఫిబ్రవరి 19న కన్నుమూశారు.