BJP Lok Sabha Committees Telangana 2024 :తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా, ఓటు శాతాన్ని మరింత పెంచుకునేందుకు రాష్ట్ర బీజేపీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ప్రజాహిత యాత్రలు, విజయ సంకల్ప యాత్రలు ప్లాన్ చేసింది. ఇప్పటికే పలువురు సభ్యులు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు.
Telangana BJP Committees For Parliament Elections 2024 :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సహా ఇంఛార్జీ అరవింద్ మీనన్ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర నేతలు లక్ష్మణ్, డీకే. అరుణ, ఈటల రాజేందర్, మురళీధర్ రావు, జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇందులోపార్లమెంట్ ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాలు, మేనిఫెస్టో, ఛార్జిషీట్ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో భాగంగానే పార్టీ నాయకత్వం తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం వివిధ కమిటీలను నియమించింది.
టార్గెట్ 17 ఎంపీ స్థానాలు - ఈనెల 20 నుంచి బస్సు యాత్రలు : కిషన్‌రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ 35కి పైగా కమిటీలు వేసింది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీకి కో- కన్వీనర్‌లుగా ఏవీఎన్ రెడ్డి, గరికపాటి, రామచందర్‌రావులను నియమించారు.