తెలంగాణ

telangana

ETV Bharat / politics

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకోవడం పెద్ద విషయం కాదు - కోమటిరెడ్డికి ఈటల కౌంటర్‌ - Etela Rajender Fire on Congress

BJP Leader Etela Rajender Fire on Congress : మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని గెలిచి మోదీకి కానుకగా ఇస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకోవడం పెద్ద విషయం కాదన్నారు.

BJP Leader Etela Rajender Fire
BJP Leader Etela Rajender Fire on Congress

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 7:29 PM IST

BJP Leader Etela Rajender Fire on Congress : కాంగ్రెస్‌తో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కౌంటర్‌(Etela Rajender Counter Attack) ఇచ్చారు. కాంగ్రెస్‌కు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే బీజేపీకు 60 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని అన్నారు. సికింద్రాబాద్‌లోని మహేంద్రాహిల్స్‌లో బీజేపీ నాయకుడు కొమురయ్య కార్యాలయంలో ఆయనను కలిసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పని చేయాలని ఈటల కోరారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటలకు హద్దు లేకుండా పోయాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించారు. ప్రశ్నించే గొంతు పేరుతో మల్కాజిగిరిలో గెలిచి ప్రజలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఈ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు.

Lok Sabha Election 2024 : మున్సిపల్‌, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు చూసుకుని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ హితవు పలికారు. మల్కాజిగిరి బీజేపీ టికెట్‌ ఆశించిన వారందరితో కలిసి పని చేసి తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మాదిరిగానే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం డబ్బుతో నాయకులను, కార్యకర్తలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. మల్కాజిగిరిలో జరిగిన ప్రధాని రోడ్‌ షో(PM Modi Road Show) అనంతరం బీజేపీకి మద్దతు మరింత పెరిందని తెలిపారు. అన్ని రంగాలు, వర్గాల ప్రజలు నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలనుకున్నట్లు స్పష్టం చేశారు.

అసలేం జరిగింది :బీజేపీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలిపారు. దీంతో ఈ విషయం ఇప్పుడు హట్‌టాఫిక్‌గా మారింది. ఇప్పుడు ఈ విషయంపై ఈటల రాజేందర్‌ ఫైర్‌ అయ్యారు.

తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​ పోటీ

మల్కాజిగిరిలో గెలిచి మోదీకి గిఫ్ట్‌ ఇవ్వాలి : మరోవైపు మల్కాజిగిరిలోని లక్ష్మీసాయి గార్డెన్‌లో జరిగిన బీజేపీ బూత్‌ స్థాయి విస్తృతస్థాయి ప్రతినిధుల సమావేశంలో ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు ఓటు వేసి మురగబెట్టుకోవద్దని ఈటల రాజేందర్‌ ప్రజలను కోరారు. ఓటర్లు తమ ఓట్లను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు వేస్తో మోరిలో వేసినట్లేనని అన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్న నరేంద్ర మోదీకి 400 సీట్లు రావడం ఖాయమని, మళ్లీ ప్రధానిగా మోదీని చూడడం ఖాయమని అన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానాన్ని గెలిచి మోదీకి బహుమతిగా అందించాలని కోరారు.

కాంగ్రెస్​ సర్కార్​లోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లు​ ట్యాపింగ్​ చేస్తున్నారన్న ఈటల - చిల్లర మాటలు మానుకోవాలన్న సీఎం రేవంత్

మోదీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు : ఈటల రాజేందర్​

ABOUT THE AUTHOR

...view details