తెలంగాణ

telangana

ETV Bharat / politics

దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి : బండి సంజయ్ - బండి సంజయ్ ఆన్ అవార్డ్స్

Bandi Sanjay Reaction on LK Advani Bharat Ratna : భారత దేశాన్ని విభజించాలని కాంగ్రెస్​ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. భారత్​కు వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై దేశ ద్రోహం కేసు పెట్టాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పద్మ అవార్డులు ఇచ్చిన ఘనత బీజేపీదేనని, ప్రస్తుతం ఎల్​కే అడ్వాణీకి భారతరత్న అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.

Bandi Sanjay Fire on Congress MP
Bandi Sanjay Reaction on LK Advani Bharat Ratna

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 7:36 PM IST

Updated : Feb 3, 2024, 8:36 PM IST

Bandi Sanjay Reaction on LK Advani Bharat Ratna: భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఎల్​కే అడ్వాణీకు భారతరత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​(Bandi Sanjay)​ అన్నారు. అనంతరం కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు. కరీంనగర్​ జిల్లాలో ఎంపీ నిధులతో అభివృద్ధి చేపట్టిన పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లడారు.

బీఆర్ఎస్​ నాయకులకు సర్పంచుల గురించి మాట్లాడే హక్కు లేదు : బండి సంజయ్

Bandi Sanjay Fire on Congress MP : భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్​ ఎంపీ డీకే సురేశ్​ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్​ మండిపడ్డారు. కాంగ్రెస్​ నేతలకు, ఉగ్రవాదులకు తేడా ఏముందని ప్రశ్నించారు. కశ్మీర్​ ప్రత్యేక దేశం కావాలని ఉగ్రవాదులు పంజాబ్​ను ఖలిస్తాన్(Khalistan)​ దేశంగా ప్రకటించాలని చెబుతున్నారని గుర్తు చేశారు. ఎంపీ సురేశ్​ భారత్​ను దక్షిణ, ఉత్తర దేశంగా విభజించాలని అంటుంటే తేడా లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా భారత్​కు వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు. భారత్​ను ముక్కలు చేయాలనుకోడం ముమ్మాటికీ దేశ ద్రోహమేనని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం జీవో 317ను వెంటనే సవరించాలి : బండి సంజయ్

"'ఇండియా' కూటమి చీలిక అవుతుంది. బిహార్​ సీఎం నితీశ్​కుమార్​ ఆ కూటమి నుంచి బయటకు రావడంతో పాటు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్​పై చేసిన విమర్శలే దీనికి నిదర్శనం. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో మళ్లీ మోదీ గెలుస్తారని సర్వేలన్ని చెబుతున్నాయి. 40 ఎంపీ సీట్లు కూడా సాధించడం కాంగ్రెస్​కు సాధ్యం కాదని మమతా బెనర్జీ చెప్పారు." - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Bandi Sanjay Intresting Comments on Awards: అడ్వాణీ(LK Advani)కి భారతరత్న పురస్కారం ప్రకటించినందుకు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలకు పద్మ అవార్డుతో సహా ఉన్నత అవార్డులను ప్రదానం చేస్తున్నారనే ప్రచారాన్ని ఖండించారు. వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పద్మ అవార్డులు ఇచ్చిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు.

Bandi Sanjay on Padma Awards :గతంలో పైరవీలు చేసుకునే వారికే అవార్డులు వచ్చేవని, మోదీ హయాంలో పైరవీలు అవినీతికి తావులేకుండా అర్హులైన వారికే అవార్డులు వరిస్తున్నాయని తెలిపారు. ఎంతోమంది పేదలకు అవార్డులు దక్కడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందన్న కాంగ్రెస్ నేతలు(Congress Leaders) చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది తామేనని అన్నారు.

దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశ ద్రోహ కేసు పెట్టాలి బండి సంజయ్

కేసీఆర్​కు పదవి ఎందుకు, బార్ పెట్టుకుంటే చాలదా - కేటీఆర్​కు బండి సంజయ్ కౌంటర్

Last Updated : Feb 3, 2024, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details