TDP MLA Ganta Srinivasa Rao Resignation : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను శాసనసభ స్పీకర్ ఆమోదించారు. ఈ మేరకు గంటా రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు గతంలో రాజీనామా చేశారు. మరోవైపు ఆయన రాజీనామాతో విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్టు శాసనభ కార్యదర్శి రామాచార్యులు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఎవరి లెక్కలు వారివే! - వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాల పర్వం
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరి 6న రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా ఇవ్వలేదని అప్పట్లో వైసీపీ నాయకులు ఆరోపించగా నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న రాజీనామాను స్పీకర్ ఇప్పుడు ఆమోదించడం గమనార్హం.
వైఎస్సార్సీపీలో మరో వికెట్ - పార్టీకి ఎంపీ సంజీవ్ కుమార్ గుడ్ బై
జగన్‌కు భయం పట్టుకుంది:మూడేళ్ల క్రితం నేను రాజీనామా చేస్తే మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. రాజీనామా ఆమోదం ముందు తనను సంప్రదించాలనే కనీస సంప్రదాయాలు పాటించలేదని ఆరోపించారు. గతంలో తాను స్పీకరును కలిసినప్పుడు ఆమోదించకుండా ఇప్పుడు ఆమోదించడమేంటని ప్రశ్నించారు. జగన్‌లో రాజ్యసభ సీట్ల భయం కన్పిస్తోందని విమర్శించారు. 50 మంది వైకాపా ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా ఓటేస్తారని జగనుకు అనుమానంగా ఉన్నట్టుందని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా రాజీనామా అకస్మాత్తు ఆమోదం రాజ్యసభ స్టంట్ అని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే రాజ్యసభ ఖాళీల నాటికి తమ సంఖ్యా బలం తగ్గించేలా అధికార పార్టీ కుట్ర చేస్తోందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, పార్టీ మారిన నలుగురు అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేల పైనా వేటు వేసే అవకాశం లేకపోలేదని తెలుగుదేశం అంచనా. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి పైనా వేటు పడుతుందని తెలుగుదేశం భావిస్తోంది. ఈ మేరకు వైసీపీ కుట్రకు ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. తామిచ్చిన అనర్హత పిటిషన్ల ఆమోదానికి స్పీకరుపై ఒత్తిడి పెంచాలని టీడీఎల్పీ భావిస్తోంది. తెలుగుదేశం రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ పై తెలుగుదేశం అనర్హత పిటిషన్ విదితమే.
'మీకో దండం జగన్'- తాడేపల్లి సీఎంవోకు గుడ్‌బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి
చెప్పేదొకటి చేసేదొకటి :శాసనసభ సాక్షిగా చెప్పిన మాటలను సైతం జగన్ అపహాస్యం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదన్న జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన కొత్తలో స్పీకర్ తమ్మినేని కి అభినందనలు చెప్తూ పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. శాసనసభలో మాట్లాడుతూ 'టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఐదుగురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని మా వాళ్లు చెప్పారు. కానీ, నేను ఆ పని చేయను. ఆ పార్టీ నుంచి ఎవరినైనా తీసుకుంటే వారిని రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే స్పీకర్‌గా మీరు వెంటనే డిస్క్వాలిఫై చేయండి అధ్యక్షా' అని అన్నారు. కానీ, ఇప్పటివరకూ తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడతా: ఆళ్ల రామకృష్ణారెడ్డి