APSFL Chairman GV Reddy on Sakshi Media:గత ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టి ఇరికించారని అందుకే కోర్టు ఆ కేసు ఛార్జషీట్ను కొట్టేసిందని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2014లో సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో టెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారనే అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. గతంలో మాజీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తే ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో రాశారన్నారు. ఫిర్యాదులో ఎక్కడా సీఎం చంద్రబాబు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారన్నారు.
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసులో చార్జిషీట్‌ను కోర్టు రిజెక్టు చేస్తే జగన్ సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో తప్పుగా ఇచ్చిన ఆడిట్ నివేదికను కోర్టు కొట్టివేసిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మేమేదో ఆడిట్ నివేదికను తొక్కిపెట్టామంటూ సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు. గతంలో తమకు కావాల్సిన వారికి ఇష్టమొచ్చినట్లు చెల్లింపులు చేసుకున్నారని అందులో ముఖ్యంగా గతంలో పనిచేసిన ఎండీ మధుసూధన్ రెడ్డి తన సొంత బ్రదర్స్‌కి 100 కోట్ల కాంట్రాక్ట్స్ ఇచ్చి, అధికార దుర్వినియోగం చేసారన్నారు.
పశు చికిత్సా భవనంలో బోధన - వైఎస్సార్సీపీ సర్కార్ నిర్వాకంతో ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్తు
అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలంటూ ఆ పేపర్లో తప్పుడు వార్తలు రాశారన్నారు. సాక్షి పేపర్‌పై పరువు నష్టం కేసు వేసే అంశాన్ని సీఐడీ అధికారులు పరిశీలించాల్సి ఉందన్నారు. ఫైబర్ నెట్లో వ్యూహం సినిమా ప్రదర్శనకు సంబంధించి అక్రమాలపై దర్శకుడు వర్మకు నోటీసులు ఇచ్చామన్నారు. ఆ నోటీసులు వర్మ అందుకున్నారన్నారు. ఫైబర్ నెట్ కేసులో చెల్లించాల్సిన డబ్బు తన వద్ద లేదని వర్మ చెబుతున్నారన్నారు.
జగన్ సిగ్గుపడాలి: వైఎస్సార్సీపీ చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా ఎదురుదాడి చేసేలా ప్రవర్తిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికతో సిగ్గు పడాల్సింది జగన్ అని ధ్వజమెత్తారు. జగన్ మూర్ఖత్వం వల్ల రాష్ట్రం ధ్వంసం అయ్యిందని మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని వెల్లడించారు. సొంత పత్రికలో అవాస్తవాలని ప్రచారం చేసే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఆరోపించారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు, రూ.71 వేల కోట్ల వడ్డీలు రాష్ట్రంపై భారం వేసిన ఘనత జగన్ రెడ్డి దని విమర్శించారు. విలాసాలతో పాటు మూర్ఖత్వం కారణంగా జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా అగాథంలోకి నెట్టేశారని మండిపడ్డారు.
ఛార్జ్‌షీట్‌ను కొట్టివేసిన కోర్టు తీర్పుపై సాక్షి తప్పుడు కథనం- జీవీ రెడ్డి (ETV Bharat) అటవీ ప్రాంతంలో మాజీ అటవీశాఖ మంత్రిగారి అక్రమ సామ్రాజ్యం-చూసేద్దామా?
విచారణకు రండి - రాంగోపాల్‌వర్మకు మరోసారి పోలీసుల నోటీసులు