AP Congress Candidates Second List : ఆంధ్రప్రదేశ్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇటీవల ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం, తాజాగా మరో ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
ఎంపీ అభ్యర్థులు:
- నరసరావుపేట- సుధాకర్
- నెల్లూరు- కొప్పుల రాజు
- తిరుపతి- చింతామోహన్
- విశాఖ- పి.సత్యనారాయణరెడ్డి
- ఏలూరు- లావణ్య
- అనకాపల్లి- వెంకటేష్